ఏసీ కోచ్‌లో నూనె దీపంతో పూజలు.. రైలు తగలబెడతావా ఏంటి సామీ!

Updated on: Jul 30, 2026 | 2:44 PM

కదులుతున్న రైలు ఏసీ కోచ్‌లో ఓ ప్రయాణికుడు నూనె దీపం, అగరుబత్తీలు వెలిగించి పూజలు చేయడం తీవ్ర కలకలం రేపింది. బోగీ అంతా పొగ వ్యాపించడంతో తోటి ప్రయాణికులు వెంటనే నిప్పును ఆర్పేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో రైల్వే సేవా స్పందించి రైలు వివరాలు కోరింది. భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ఇటీవల కొందరు వ్యక్తులు భక్తి పేరుతో చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కదులుతున్న రైలు ఏసీ కోచ్‌లో ఓ ప్రయాణికుడు చేసిన నిర్వాకం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతూ, ఏసీ బోగీలోని అప్పర్‌ బెర్త్‌పై నూనె దీపం, అగరుబత్తీలు వెలిగించి సదరు వ్యక్తి పూజలు చేశాడు. కొద్దిసేపటికే బోగీ అంతా పొగ ఆవరించడంతో తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి నిప్పును ఆర్పేశారు. ఈ భయంకరమైన దృశ్యాలను ప్రయాణికులు కెమెరాలో బంధించి నెట్‌లో పోస్ట్ చేయడంతో వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఏసీ కోచ్‌లలో ఉండే కర్టెన్లు, సీట్లు అత్యంత వేగంగా మంటలు అందుకనే సింథటిక్ పదార్థాలతో రూపుదిద్దుకుంటాయి. అంతేకాకుండా, అగరుబత్తీల పొగకు ఆటోమేటిక్ స్మోక్ డిటెక్టర్లు యాక్టివేట్ అయి ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ ఆన్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యక్తిగత విశ్వాసాల పేరుతో మిగతా వారి ప్రాణాలతో చెలగాటమాడిన ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే శాఖ అధికారిక ఫిర్యాదుల విభాగం ‘రైల్వే సేవా’ స్పందించింది. సదరు రైలు నంబరు, ప్రయాణ వివరాలు అందించాలని నెటిజన్లను కోరింది. ఇలాంటి తీవ్ర భద్రతా ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితుడిపై భారీ జరిమానా విధించి అరెస్ట్ చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మృగాన్నే అయినా.. నేనూ అమ్మనే.. కొంచెం ఆగండి!

Loading...
Unable to load recommendations.
Follow Us