Tesla Car: టెస్లా కార్.. అన్నీ ఉన్నా బ్రేకులు లేకపోతే ఎలా..? బ్రేకులు ఫెయిలయిన టెస్లా మోడల్ వై కారు..

|

Nov 17, 2022 | 9:45 AM

టెస్లా కార్ గురించి వినని వాళ్ళు ఉండరు. ఏదోక సమయంలో తప్పక అనుకునే ఉంటారు.. ‘ఆ కారు నా సొంతం అయితే ఎంత బాగుంటుందోన’అని.


టెస్లా కార్ గురించి వినని వాళ్ళు ఉండరు. ఏదోక సమయంలో తప్పక అనుకునే ఉంటారు.. ‘ఆ కారు నా సొంతం అయితే ఎంత బాగుంటుందోన’అని. అయితే ఇప్పుడు టెస్లా కారుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. చైనా వీధుల్లో.. బ్రేకులు ఫెయిలయిన టెస్లా మోడల్ వై కారు వేగంగా దూసుకువెళ్లి.. అదుపు తప్పినట్లు ఆ వీడియోలో తెలుస్తుంది. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్సులో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఒక బైక్ రైడర్‌, ఓ చిన్నారి చనిపోయారు. చివరికి టెస్లా కారు వెళ్లి మరో భారీ వాహనాన్ని ఢీకొట్టి ఆగింది.చైనాలోని అతి పెద్ద మార్కెటింగ్ కంపెనీలలో టెస్లా కూడా ఒకటి కావడంతో.. ఈ ఘటనపై చైనా పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. ఇందులో అమెరికాకు చెందిన ఈవీ మేకర్ కూడా సహకరిస్తోంది. కారు అదుపు తప్పడానికి కారణమేమిటో ఇంకా తెలియలేదని, ఇంటి ముందు ఉన్న షాపు నుంచి కారును తీస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని కారులో ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై స్పందిస్తూ.. కారు వేగంగా వెళ్తున్నప్పుడు బ్రేక్ లైట్లు పనిచేయవు. ఇంకా కారును ఆపేందుకు బ్రేక్ మీద కాలు వేసినట్లు డాటాలో కనిపించడంలేద’ని టెల్సా కంపెనీ తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Tattoo for Govt Job: పచ్చబొట్టు ఉంటే కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగం కట్..! ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన యువకుడు..

Woman – daughter: అమానుషం.. తన ప్రియుడితో కుమార్తెకు పెళ్లి చేయించిన తల్లి..! బిడ్డను కాపాడుకోవాల్సిన త‌ల్లే ఇలా..

Hognose snake: పాముల ప్రపంచానికి డ్రామా రాణి.. ఈ పాము వేషాలు మామూలుగా లేవుగా.. చ‌నిపోయిన‌ట్లు న‌టించి..

Published on: Nov 17, 2022 09:45 AM