Man Vs Aliens Video: అందుకే ఏలియన్స్‌పై కాల్పులు చేశా..? నిందితుడి కామెంట్స్ వైరల్ అవుతున్న వీడియో

|

Sep 22, 2021 | 10:29 PM

ఏలియన్స్‌ ఇప్పటికీ ఎవ్వరికి అంతుచిక్కని అదో మిస్టరీ. అసలు ఏలియన్స్‌ జీవం అంటూ ఉందో లేదో తెలియదు కానీ.. వీటిపై సోషల్‌మీడియాలో నిత్యం జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక తాజాగా ఓ వ్యక్తి.. ఏలియన్స్‌ తనకు కనిపించాయని, అవి తన రూమ్‌లోకి వచ్చే ప్రయత్నం చేయగా..

ఏలియన్స్‌ ఇప్పటికీ ఎవ్వరికి అంతుచిక్కని అదో మిస్టరీ. అసలు ఏలియన్స్‌ జీవం అంటూ ఉందో లేదో తెలియదు కానీ.. వీటిపై సోషల్‌మీడియాలో నిత్యం జరిగే రచ్చ అంతా ఇంతా కాదు. ఇక తాజాగా ఓ వ్యక్తి.. ఏలియన్స్‌ తనకు కనిపించాయని, అవి తన రూమ్‌లోకి వచ్చే ప్రయత్నం చేయగా.. వాటి కాల్పులు జరిపానంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఇప్పుడీ వార్త నెట్టింట ఫుల్‌ వైరల్‌ అవుతుంది.

ఏలియన్స్‌ పేరుతో ఎలాంటి వార్తలు వచ్చినా.. ఇట్టే వైరల్‌ అవుతుంటాయి.ఇక మొన్నటి మొన్న ఓ మహిళ.. తనను ఏలియన్స్‌ చాలాసార్లు కిడ్నాప్‌ చేశాయంటూ ఆమె చేసిన కామెంట్స్‌ ఒక్కసారిగా షాక్‌కు గురి చేశాయి. ఇక తాజాగా అమెరికాలోని కెంటుకీ హోటల్‌లో ఉంటున్న శామ్యూల్‌ రిడెల్‌ అనే వ్యక్తికి ఏలియన్స్‌ కనిపించాయని తెలిపాడు. అంతేకాదు తాను ఉంటున్న రూమ్‌ కిటికీలో నుంచి పార్కింగ్‌ వైపుకు చూడగా.. అప్పుడు ఏలియన్స్‌ కనిపించాయని చెప్పుకొచ్చాడు.

తనను గమనించిన ఏలియన్స్‌.. తన రూమ్‌ వైపుకు రావడం చూసి భయపడిపోయానని తెలిపాడు శామ్యూల్‌. దీంతో వెంటనే తన వద్ద ఉన్న గన్‌తో ఏలియన్స్‌పైకి కాల్పులు జరిపిన్నట్లు చెప్పుకొచ్చాడు. ఆ తర్వత సడెన్‌గా అవి కనిపించకుండా పోయావని అన్నాడు. ఇక హోటల్‌ గది నుంచి కాల్పుల శబ్దం రావడంతో వెంటనే హోటల్‌ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శామ్యూల్‌ చెప్పిన సమాధానం విని షాక్‌ గురి అయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.
YouTube video player
మరిన్ని చదవండి ఇక్కడ : Balakrishna Sensational Comments Video: మా ప్రభుత్వం రాగానే.. ఒక్కొక్కరి సంగతి చూస్తాం.. బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్…(వీడియో)

 Ek Number News Live Video: కుప్పలు తెప్పలుగా కండోమ్‌లు.. చింత చెట్టుకు నెత్తుటి పంట.. (వీడియో)

 Big News Big Debate LIVE: కేంద్రంపై విపక్షాల దండయాత్ర వ్యూహమేంటి..?కేంద్ర రాష్ట్ర విధానాలపై..(వీడియో)

 FYI With Swathi video: మీ ఆడవాళ్ళను అడ్డం పెట్టుకొని రాకండి.. అమెరికాలో హైతీ శరణార్థులు.. (వీడియో)