60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన గుత్తా జ్వాల.. వేల మంది చిన్నారులకు అమ్మగా మారిన స్టార్
భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల తన తల్లిపాలను దానం చేస్తూ మానవత్వానికి కొత్త అర్థం చెప్పారు. ఇప్పటివరకు 60 లీటర్లకు పైగా చనుబాలను ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా పసికందులకు అందించారు. తల్లిపాలను ‘లిక్విడ్ గోల్డ్’గా అభివర్ణించిన జ్వాల.. ప్రతి తల్లి ముందుకు వస్తే ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు కాపాడవచ్చని పిలుపునిచ్చారు.
హైదరాబాద్ స్టార్ బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల అమ్మతనానికి అసలైన అర్థం చెప్పారు. కడుపున పుట్టిన బిడ్డకే కాదు ఎంతోమంది పసికందులకి చనుబాలు అందించి అమ్మగా మరో మెట్టు ఎక్కారు. ఎన్ని లీటర్ల పాలు దానం చేసారో తెలుసా? గుత్తా జ్వాల 2010, 2014 కామన్వెల్త్ గేమ్స్ లో వరుసగా రెండు స్వర్ణ పతకాలు సాధించి భారత్‌ను ప్రపంచపటంలో సగర్వంగా నిలిపారు. ఇప్పుడు అమ్మతనంతో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. తన చనుబాలను దానం చేస్తూ ఎందరో చిన్నారులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తున్నారు. ఇలా చిన్నారులకు ప్రేమను పంచుతూ నేటితరం అమ్మలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతిరోజు సుమారు 600 మిల్లి లీటర్ల పాలను చెన్నైలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో తల్లిపాలకు దూరమైన శిశువులకు అందించారు. ఇప్పటివరకు ఏకంగా 60 లీటర్ల తల్లిపాలను గుత్తా జ్వాల దానం చేశారు. తనలాగే ప్రతి తల్లి బ్రెస్ట్ మిల్క్ డొనేట్ చేయాలని కోరారు… దీంతో ఆరోగ్యవంతమైన సమాజం రూపుదిద్దుకుంటుందని అన్నారు. తల్లిపాల దానం గురించి తనకు నిజానికి పెద్దగా తెలియదనీ డాక్టర్ల ప్రోత్సాహంతోనే దీనికి పూనుకున్నాననీ గుత్తా జ్వాల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అనేక కారణాల వల్ల బిడ్డలకు పాలు ఇవ్వలేని తల్లులకు, ముఖ్యంగా నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు దాతల నుంచి సేకరించిన పాలు ఎంతగానో ఉపయోగపడతాయని డాక్టర్లు వివరించారని ఆమె తెలిపారు. కేవలం 100 మిల్లీలీటర్ల తల్లిపాలు, ఒక కిలో బరువున్న చిన్నారికి చాలా రోజుల వరకు సరిపోతాయని, బాలింతలు తన లాగే ముందుకు వస్తే.. ఎంతోమంది పసికందుల ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. తల్లిపాలను ‘లిక్విడ్ గోల్డ్’ అని పిలుస్తారని, ఇఅదులో యాంటీబాడీలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయని, శిశువుల రోగనిరోధక శక్తిని పెంచుతాయని జ్వాల తెలిపారు. తన బిడ్డకు పట్టగా మిగిలిపోతున్న చనుబాలను ఇతర చిన్నారులకు అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రతి రెండు, మూడు గంటలకు ఒకసారి పాలను పంప్ చేయాల్సి వచ్చేదనీ ఆ ప్రక్రియ శారీరకంగా బాధాకరమైనా, అలసట కలిగించినా, ఆ పాలు ఒక చిన్నారికి ఉపయోగపడతాయనే ఆలోచన ఎంతో సంతృప్తినిచ్చిందని ఆమె అన్నారు. అమెరికాకు చెందిన ఓ మహిళ.. తల్లిపాలను అమ్ముతూ నెలకు లక్షల్లో సంపాదిస్తోంది… ఆ విషయాన్ని ఆమె బయటపెట్టింది. ప్లోరిడాకు చెందిన 32 ఏళ్లు జూలీ డేనిస్ బిడ్డకు జన్మనిచ్చింది… ఆ క్రమంలోనే ఆమె తన చనుబాలను అమ్మడం ప్రారంభించింది. అలా పాలను అమ్ముతూనే ఆమె నెలకు రూ.10 లక్షల వరకు ఆదాయం పొందిందట. అలా కొందరు తల్లిపాలను వ్యాపారంగా మార్చుకుంటే గుత్తా జ్వాల మాత్రం ఉచితంగానే ప్రభుత్వ హాస్పిటల్స్ కి పాలను దానం చేస్తూ గొప్పమనసు చాటుకున్నారు… ఎందరో చిన్నారులకు దేవుడిచ్చిన అమ్మగా మారారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫోర్జరీ పత్రాలతో జైలు నుంచి దర్జాగా రిలీజైన జీవిత ఖైదీ..
గుడిలోకి వెళ్లి భక్తితో దణ్ణం పెట్టాడు.. ఆ తర్వాత..!
రూ.100 మ్యాగీ, ఓ కూల్ డ్రింక్ బాటిల్..బాలుడి బర్త్‌డే వేడుకలు వైరల్
