వామ్మో.. నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. మృత్యుంజయుడైన బైకర్!
గుజరాత్‌లోని సూరత్‌లో భారీ కంటైనర్ రోడ్డుపై బోల్తాపడింది. పక్కనే వెళ్తున్న బైకర్ తృటిలో ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. కంటైనర్ బోల్తాపడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగగా, అధికారులు వెంటనే దాన్ని తొలగించారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.
గుజరాత్‌లోని సూరత్ నగరంలో భారీ కంటైనర్ రోడ్డుపై బోల్తాపడింది. కపోద్రా చికువాడి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో పక్కనే వెళ్తున్న ఓ బైకర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. భారీ వాహనం ఒక్కసారిగా రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రద్దీగా ఉండే రహదారిపై కంటైనర్ బోల్తాపడటంతో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి రోడ్డుపై పడిపోయిన కంటైనర్‌ను తొలగించడంతో ట్రాఫిక్ పునరుద్ధరించారు. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Published on: Oct 29, 2026 05:28 PM
Loading...
Unable to load recommendations.
Follow Us