మనిషి రూపంలో పుట్టిన మేకపిల్ల.. చూస్తే షాక్ అవ్వాల్సిదే వీడియో
మేకకు మనిషిని పోలిన పిల్ల పుట్టిన వింత ఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్‌పేట సమీపం సేందమంగళం గ్రామానికి చెందిన ఆనందన్ అనే రైతు ఇరవైకి పైగా మేకలు పెంచుతున్నాడు. అందులో ఓ మేక ఆదివారం రెండు పిల్లలకు జన్మనిచ్చింది. వాటిల్లో ఒకటి సాధారణంగానే ఉండగా, మరొకదాని ముఖం, వీపు భాగం, మరికొన్ని అవయవాలు మనిషిని పోలి ఉన్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆనందన్ ఇంటికి వచ్చి వింత ఆకారంతో పుట్టిన మేక పిల్లను ఆశ్చర్యంగా చూసి వెళ్లారు.
పుట్టిన కొద్దిసేపటికే ఆ గొర్రె పిల్ల చనిపోయినా.. ఈ విషయం అంతటా వ్యాపించడంతో పరిసర గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని గొర్రెపిల్ల కళేబరాన్ని చూశారు. ఇది కలికాలం ఇలాంటి వింతలే జరుగుతాయని.. అయినా ఇదంతా ఎప్పుడో పురాణాల్లో రాసుందని వ్యాఖ్యానించారు. వింత ఆకారంతో మేక పిల్ల పుట్టినందున గ్రామంలో ఏదైనా చెడు జరుగుతుందేమోనని భయాందోళనకు గురవుతున్నారు.అయితే, వివిధ జన్యులోపాల వల్ల ఇలాంటి గొర్రె పిల్లలు జన్మించే అవకాశం వుందని పశు వైద్య నిపుణలు చెబుతున్నారు. సోషల్‌మీడియాలో ఈ గొర్రె పిల్లకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. గొర్రెపిల్ల మృతదేహానికి ఆనందన్ కుటుంబీకులు పూజలు చేసి, అంత్యక్రియలు చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
ఐశ్వర్యారాయ్ 17 ఏళ్లుగా రాఖీ కడుతున్న ఆ స్టార్ యాక్టర్ ఎవరో తెలుసా?
కాసేపట్లో పెళ్లి.. మొదటి భార్యతో వరుడు జంప్ వీడియో
సింహానికి ఎదురెళ్లిన మనిషి.. చివరికి.. వీడియో
ఆ సమయంలో మహిళలకు ఎందుకు ఎక్కువగా జుట్టు రాలిపోతుందో తెలుసా?