ఇదేంటి భయ్యా.. మందు తాగకుండానే పాజిటివ్‌

Updated on: Jul 18, 2025 | 8:01 PM

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో దొరికిపోయి కొందరు జరిమానాలు చెల్లిస్తున్నారు. మరికొందరు జైలుకు వెళ్లి శిక్ష అనుభవిస్తున్నారు. మద్యం తాగే అలవాటు ఉన్నవారికి డ్రంక్ అండ్ డ్రైవ్ పెద్ద సమస్యగా మారింది. కానీ మద్యం తాగకుండానే కొందరికి ఈ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చింది. తమకు అసలు డ్రింక్ చేసే అలవాటు లేకున్నా ఇలా ఎందుకు వచ్చిందని తలలు పట్టుకుంటున్నారు.

అయితే అది బ్రీత్ ఎనలైజర్ మిషన్ ప్రాబ్లమ్‌ అని కొందరు వాదిస్తున్నారు. అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో డ్రింక్ తీసుకోకుండా పాజిటివ్ రావడానికి కారణం ఏంటి? కడుపులో జరిగే కొన్ని రసాయన క్రియల వల్ల ఈ పరిస్థితి ఎదురవుతుందంటున్నారు వైద్యులు. దీనినే Auto Bravery Syndrome అని అంటారు. అంటే కడుపులో గ్యాస్ లాగా తయారైన ఒక వాయువు నోటి ద్వారా రావడంతో ఇది ఆల్కహాల్ గా మారిపోయి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో పాజిటివ్‌గా చూపిస్తుంది. కడుపులో ఉండే గ్యాస్ట్రో లో కుడి ఎడమవైపు ఉన్న ఆమ్లాలు కలిసిపోయి ఇథనాల్ ను రిలీజ్ చేస్తాయి. దీంతో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో ఆల్కహాల్ తీసుకున్నట్లుగా చూపిస్తుంది. ఈ ఇథనాల్ రిలీజ్ అయిన సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో మాత్రమే కాకుండా శరీరంలో కూడా అనేక మార్పులు వస్తాయంటున్నారు వైద్యులు. దీంతో తీవ్రమైన నీరసం వస్తుంది. డిప్రెషన్‌కు గురవుతారు. అంతేకాకుండా మద్యం సేవించిన వారిలా మత్తుగా ఉంటారు. ఒక్కోసారి మాట తడబడుతూ ఉంటుంది. చాలా విషయాలు మర్చిపోతూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఇథనాల్ రిలీజ్ కావడంతో లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మానసికంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే లో డార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అంటే జంక్ ఫుడ్ తో పాటు ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఇలాంటి వాయువు ఉత్పత్తి అవుతుందంటున్నారు. అంతేకాకుండా కొన్నాళ్లపాటు ఆల్కహాల్ తీసుకొని.. ఆ తర్వాత మానేసినా కూడా ఇటువంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. ముఖ్యంగా ఆహారం తీసుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లైట్ ఫుడ్ మాత్రమే తీసుకునే ప్రయత్నం చేయాలి. ఈ సమస్య ఒక్కసారి వచ్చిందంటే అప్పటినుంచి ఆహార పద్ధతులు మొత్తం మార్చుకోవాలి. లేకుంటే ఈ ఇథనాల్ పదేపదే రిలీజ్ కావడం వల్ల మద్యం సేవించకుండానే తాగుబోతుల ముద్ర పడిపోతుంది. దీంతో మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఫోన్‌‌ చూసీ.. చూసీ.. యువకుడికి సరికొత్త వ్యాధి.. ఆ సామర్థ్యాన్ని కోల్పోయిన బాధితుడు

ప్రభాస్‌ సినిమాకు OTT దెబ్బ..! రిలీజ్‌ కష్టమేనా?

స్పిరిట్ సినిమాపై అతి తెలివిగా మాట్లాడిన త్రిప్తి

రిలీజ్‌కు ముందే 50 కోట్లు కొల్లగొట్టిన కింగ్‌ ??

స్పెషల్ లేడీతో మహేష్ మాస్ స్టెప్పులు.. కుర్చీని తిరగేసే ప్లాన్ చేస్తున్న జక్కన్న