మిస్‌ ఏలూరుగా..దివ్య!

Updated on: Mar 26, 2026 | 9:45 AM

సాధారణంగా మహానగరాలకే పరిమితమయ్యే ఫ్యాషన్ సందడి ఇప్పుడు ఏలూరు గడ్డపై మెరిసింది. స్థానిక యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించిన క్రౌన్ ఆఫ్ ఏలూరు అందాల పోటీలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ హోరాహోరీ పోటీలో తనదైన శైలిలో రాణించిన దివ్య ఆలపాటి ‘మిస్ ఏలూరు’ కిరీటాన్ని దక్కించుకున్నారు.

ప్రముఖ దర్శకుడు సతీష్ అడ్డాల పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీలకు జిల్లా నలుమూలల నుంచి యువతీ యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేవలం అందమే కాకుండా, ర్యాంప్ వాక్, ఐక్యూ రౌండ్లలో అడిగిన ప్రశ్నలకు సమయస్ఫూర్తితో సమాధానాలిచ్చి దివ్య అందరినీ ఆకట్టుకున్నారు. విజేతగా నిలిచిన ఆమెకు దర్శకుడు సతీష్ అడ్డాల, కో-డైరెక్టర్ ప్రియా ఎండానా, ఇతర సినీ ప్రముఖులు ట్రోఫీని, కిరీటాన్ని అందజేసి అభినందించారు.కేవలం మిస్ ఏలూరు మాత్రమే కాకుండా.. మిసెస్ ఏలూరు, మిస్టర్ ఏలూరు, కిడ్స్ విభాగాల్లో కూడా పోటీలు నిర్వహించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా ర్యాంప్ పైన క్యాట్‌వాక్ చేస్తూ ప్రేక్షకులను అలరించారు. “మిస్ ఏలూరుగా ఎంపికవ్వడం తనకెంతో గర్వంగా ఉందని, ఏలూరు వంటి పట్టణాల్లో ఇలాంటి వేదికలు కల్పించడం వల్ల యువతలోని టాలెంట్ బయటకు వస్తుందని దివ్య ఆలపాటి సంతోషం వ్యక్తం చేశారు. ఫ్యాషన్ రంగ నిపుణులు, భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రేక్షకులతో ఏలూరు నగరం గ్లామర్ ప్రపంచాన్ని తలపించింది.

Loading...
Unable to load recommendations.
Follow Us