ఆ తర్వాత థియేటర్లలో జాతీయగీతాలాపన తప్పనిసరికాదంటూ పక్కన పెట్టేశారు. కానీ తెలంగాణలోని చెల్పూర్ గ్రామస్తులు నిత్యం జాతీయగీతాలాపన చేస్తూ నిజమైన దేశభక్తులుగా నిలుస్తున్నారు. రెండేళ్లుగా నిరంతరం కొనసాగుతోంది ఈ సామూహిక జాతీయగీతాలాపన. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో వరంగల్-మహారాష్ట్ర జాతీయ రహదారిపై గాంధీ విగ్రహం వద్ద గ్రామస్తులు జాతీయగీతాలాపన చేస్తున్నారు. గత రెండేళ్లు గా ప్రతి రోజు క్రమం తప్పకుండా గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ దేశభక్తికి స్ఫూర్తి గా నిలుస్తున్నారు చెల్పూర్ గ్రామస్తులు. శ్రీ శ్రీనివాస వర్తక సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 24, 2022 న ఈ జాతీయ గీతాలాపన కార్యక్రమం ప్రారంభమైంది. అప్పటినుంచి ప్రతి నిత్యం ఇక్కడ వర్తకులు, గ్రామస్తులు పాల్గొని జాతీయ గీతం పాడుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం యువతలో క్రమశిక్షణ లోపించింది.. యువత డ్రగ్స్,చెడు అలవాట్లకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. యువత ఇలా పెడత్రోవ పట్టడంతో తమ కుటుంబాలకే కాకుండా దేశానికి కూడా తీరని నష్టం వాటిల్లుతోంది. యువతలో దేశభక్తిని మేల్కొల్పడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. నేటి బాలలే రేపటి పౌరుల్లా ఎదగాలంటే ఈ జాతీయ గీతాలాపన ఎంతో ఉపయోగపడుతుందని,యువత ను ఉత్తములుగా తీర్చి దిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు ఆ గ్రామస్తులు. చెల్పూర్ గాంధీ జంక్షన్ లో నిత్యం జాతీయ గీతాలాపన చేయడం అభినంద నీయమని ఇదే స్ఫూర్తి జిల్లా అంతా విస్తరించి ఆచరణలోని రావాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీనేజర్ ప్రాణం తీసిన ఏఐ చాట్‌బాట్ !! గూగుల్‌పై దావా వేసిన తల్లి
టాటూ వేయించుకుంటే రక్తం దానం చెయ్యకూడదా ??
అప్పు ఇచ్చిన బిచ్చగాడికి దివాలా నోటీస్ పంపిన ఘనుడు.. పాపం బెగ్గర్..