సినిమా రేంజ్ ఛేజింగ్.. కారుపై వేలాడుతూ 40 కి.మీ వెళ్లిన కానిస్టేబుల్

Updated on: Sep 29, 2026 | 10:17 PM

తమిళనాడులోని కోయంబత్తూరులో అక్రమ గుట్కా తరలిస్తున్న కారును పట్టుకునేందుకు హెడ్‌ కానిస్టేబుల్‌ వేల్మురుగన్‌ సాహసోపేతంగా వ్యవహరించారు. పోలీసులను చూసి ఆపకుండా దూసుకెళ్లిన కారుపైకి ఎక్కిన ఆయన సుమారు 40 కిలోమీటర్లు ప్రయాణించారు. చివరకు పోలీసులు కారును చుట్టుముట్టి ఆపగా, ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో సుమారు 300 కిలోల నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తమిళనాడులోని కోయంబత్తూరులో హాలీవుడ్ యాక్షన్ సినిమాను తలపించే సంఘటన జరిగింది. కర్ణాటక నుంచి అక్రమంగా గుట్కా తరలిస్తున్న ముఠాను పట్టుకునేందుకు ఒక హెడ్ కానిస్టేబుల్ తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి కారు పైకప్పుపై వేలాడుతూ ఏకంగా 40 కిలోమీటర్లు ప్రయాణించారు. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు బెంగళూరు నుంచి కారులో దాదాపు 300 కిలోల నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను తమిళనాడుకు తరలిస్తున్నారు. రహదారిపై వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి నిందితులు కారును ఆపకుండా పరారయ్యేందుకు ట్రై చేసారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఎస్‌ఐని పక్కకు తోసేసి, కారు తలుపులు మూసి వేగంగా ముందుకు పోనిచ్చారు. వెంటనే స్పందించిన హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ దూసుకెళ్తున్న ఆ కారు పైకప్పు మీదకు దూకారు. కారుపై పోలీసు ఉన్నా పట్టించుకోకుండా నిందితులు విళాంకురిచ్చి, కాళపట్టి, సిత్రా మీదుగా కనియూర్ టోల్‌ప్లాజా వైపు అత్యంత వేగంగా వాహనాన్ని పోనిచ్చారు. గాల్లో వేలాడుతున్న కానిస్టేబుల్‌ను చూసి దారిన వెళ్లే వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొందరు వీడియోలు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్సులతో కలిసి ఆ కారును వెంబడించారు. చివరకు అవినాశి అన్నపూర్ణ హోటల్ వద్ద పోలీసులు అత్యంత చాకచక్యంగా కారును చుట్టుముట్టి ఆపేశారు. కారు ఆగగానే ఇద్దరు నిందితులు పారిపోగా, ఒకరు పట్టుబడ్డారు. ఆ తర్వాత పోలీసులు గాలించి మిగతా ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కారులోని 300 కిలోల గుట్కాతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రాణాలకు తెగించి విధి నిర్వహణలో అసాధారణ ధైర్యం ప్రదర్శించిన హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్‌ను తమిళనాడు ప్రజలతో పాటు ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఉదయాన్నే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని.. అక్కడ సీన్‌ చూసి భయంతో పరుగు

బుల్లెట్‌ ట్రైన్‌లో టీమ్‌ ఇండియా.. ఆటగాళ్ల రియాక్షన్‌ చూస్తే

PM-KISAN: రైతులకు దసరా ధమాకా.. ఆ రోజే అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు

Anant Ambani: ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ సాయం

ఏఐ ఎంత ప‌ని చేసింది.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి భారీ చలాన్‌!

Loading...
Unable to load recommendations.
Follow Us