Chat GPT: ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాట్‌ చాట్‌జీపీటీ’.. 25 లక్షల యూజర్లు చూపు ఆ AI వైపే

Updated on: Mar 06, 2026 | 1:29 PM

ఓపెన్ AI-అమెరికా రక్షణ శాఖ ఒప్పందం చాట్‌జీపీటీకి షాకిచ్చింది. AIని సైనిక అవసరాలకు వాడటం నైతికం కాదని భావించిన 25 లక్షల మంది యూజర్లు 'క్విట్ చాట్‌జీపీటీ' ఉద్యమాన్ని ప్రారంభించారు. ఫలితంగా చాట్‌జీపీటీని వదిలిపెట్టి, ఆంథ్రోపిక్‌కు చెందిన 'క్లాడ్' చాట్‌బాట్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామంతో క్లాడ్ యాప్ స్టోర్లలో అగ్రస్థానానికి చేరింది. ఓపెన్ AI సీఈఓ సమ్ ఆల్ట్‌మాన్ స్పందించారు, ఒప్పందంలో మార్పులు చేస్తామన్నారు.

AI చాట్‌బాట్ చాట్‌జీపీటీకి ఊహించని షాక్ తగులుతోంది. ఏకంగా 25 లక్షల మంది యూజర్లు చాట్ జీపీటీని బాయ్ కాట్ చేశారు. ఉన్నట్టుండి 25 లక్షల మంది యూజర్లు చాట్ జీపీటీని వదిలి పెట్టి ప్రత్యామ్నాయ చాట్ బాట్‍ల వైపు మొగ్గుచూపుతున్నారు. నిన్నమొన్నటి వరకు నెత్తిన పెట్టుకున్న యూజర్లు ఇలా అకస్మాత్తుగా ఆగ్రహం వెలిబుచ్చడం వెనుక అమెరికా రక్షణ శాఖతో ఓపెన్ ఏఐ సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం అసలు కారణం. ఓపెన్ ఏఐ తన ఏఐ మోడళ్లను అమెరికా రక్షణ శాఖ రహస్య నెట్‌వర్క్‌లలో ఉపయోగించుకునేలా గత వారం ఒక ఒప్పందంపై సంతకం చేసింది. ఏఐ సాంకేతికతను మిలిటరీ అవసరాలకు ఇంకా నిఘా పనులకు ఉపయోగించడం నైతిక విలువలకే విరుద్ధమని వినియోగదారులు భావిస్తున్నారు. ఈ ఒప్పందం నచ్చని యూజర్లు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ‘క్విట్ చాట్ జీపీటీ’ ఉద్యమం సోషల్ మీడియాలో మొదలు పెట్టారు. ఈ ఉద్యమం ఇప్పుడు ఊపందుకోవడంతో పెద్ద సంఖ్యలో చాట్ జీపీటీని బాయ్‌కాట్ చేసి వెళ్లిపోతున్నారు. తమ ఫోన్‌లలోనుంచి చాట్ జీపీటీ యాప్‌ను డిలీట్ చేసేస్తున్నారు. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం గత శనివారం ఒక్కరోజే అమెరికాలో చాట్‌జీపీటీ యాప్ అన్‌ఇన్‌స్టాల్‌లు 295 శాతం పెరిగాయి. వినియోగదారుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతపై ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మాన్ స్పందించారు. ఈ ఒప్పందాన్ని చాలా హడావిడిగా చేశామని, స్పష్టమైన కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఇలా జరిగిందని అంగీకరించారు. పరిస్థితులను చక్కబెట్టడానికి ప్రయత్నిస్తున్నాం అని ప్రకటించారు. పెంటగాన్‌తో చేసుకున్న ఒప్పందంలో కూడా మార్పులు చేస్తున్నట్లు ఓపెన్ ఏఐ స్పష్టం చేసింది. నిజానికి అమెరికా రక్షణ శాఖ గతంలో ఆంథ్రోపిక్‌ ఏఐ మోడల్స్‌ను ఉపయోగించేది. ఆంథ్రోపిక్‌ ఏఐ క్లాడ్‌ మోడల్స్‌ను అమెరికా మిలటరీ అపరిమతంగా, ఎలాంటి నియంత్రణలు లేకుండా వినియోగించుకొనేందుకు యాక్సెస్‌ ఇవ్వాలని అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేశారు. అయితే అందుకు ఆంత్రోపిక్‌ అంగీకరించలేదు. దాంతో ట్రంప్ ఆంథ్రోపిక్‌కు గుడ్ బై చెప్పి ఓపెన్ ఏఐ‍తో ఒప్పందం చేసుకున్నారు. ఆంథ్రోపిక్‌ నో చెబితే ఓపెన్ ఏఐ ఓకే చెప్పడం పట్ల యూజర్లు మండిపడుతున్నారు. ఈ ఒప్పందానికి నిరసనగాచాట్ జీపీటీని వదిలేసి ఆంత్రోపిక్ సంస్థకు చెందిన ‘క్లాడ్’ చాట్‌బాట్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా యాపిల్ యాప్ స్టోర్‌లో చాట్‌జీపీటీని వెనక్కి నెట్టి క్లాడ్ టాప్ ప్లేస్‌కు చేరుకుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జంబలకిడిపంబ హోలీ చూసారా.. !! వాళ్ళు వీళ్లు అవుతారు.. వీళ్లు వాళ్ళు అవుతారు

Iran Strikes Back at Israel: ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతున్న ఇరాన్

Egg Prices: వార్ ఎఫెక్ట్ తో దారుణంగా పడిపోయిన కోడిగుడ్డు ధరలు

Price Hike: కంట్రోల్ తప్పుతున్న నిత్యావసరాల ధరలు

తెలంగాణకు కొత్త గవర్నర్.. శివప్రతాప్ శుక్లా నియామకం.. దేశవ్యాప్తంగా గవర్నర్ల బదిలీలు

Follow Us