అవతార్ లో మనిషి భూమి మీద పుట్టాడురా.. ఏం జరిగిందో తెలిస్తే షాక్..
అవతార్ సినిమాలోని నీలి రంగు మనుషుల్లాగే యూకేలో ఓ వ్యక్తి శరీరం నీలం రంగులోకి మారి వైద్యులను ఆందోళనకు గురిచేసింది. ఆక్సిజన్ లేదా ఐరన్ లోపం వంటి ఆరోగ్య కారణాలు అనుకున్నా, చివరికి ఓ సరదా విషయం బయటపడింది. స్నేహితుడు ఇచ్చిన నీలం రంగు పరుపు, దుప్పట్లే ఈ రంగు మార్పునకు కారణమని తెలిసి, అందరూ నవ్వుకున్నారు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
‘అవతార్’ సినిమాలో మీకు నచ్చిన విషయం ఏంటంటే చాలామంది చెప్పే మాట నీలం రంగు మనుషులు, వాళ్లుండే ప్రదేశం, వింత వింత ఆకారాలు.. ఇలా ఒకటేమిటి మూవీలోని ప్రతిదీ కూడా ఇంతకుముందు మనం ఎప్పుడూ చూడనిదే. వీటన్నింటిని వందలాది మంది వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్ ఆర్టిస్ట్‌లు ఏళ్లకు ఏళ్లు కష్టపడి సృష్టించారు. పండోరా అద్భుత ప్రపంచాన్ని వారు మన కళ్లముందుకు తీసుకొస్తే … తాజాగా యూకేలో ఓ మనిషి నీలం రంగులోకి మారి డాక్టర్లను టెన్షన్ పెట్టాడు. కొందరిలో 5 గోర్లు నీలం రంగులోకి మారతాయి. శరీరంలో ఆక్సిజన్ లోపించినా ఐరన్ తక్కువైనా ఇలా జరుగుతుంది. రక్తహీనత లేదా ఊపిరితిత్తుల వ్యాధులకు కూడా సంకేతం కావచ్చు. అటువంటి పరిస్థితిలో వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. యూకేలోని డెర్బిషైర్ ప్రాంతంలో ఓ వ్యక్తి రాత్రి పడుకొని, పొద్దునే లేచే సరికి నీలం రంగులోకి మారిపోయాడు. అచ్చం అవతార్ సినిమాలో పాత్రధారుల్లాగా. ఇంతకీ ఏం జరిగిందా అని డాక్టర్లు ఆరా తీయగా, షాకింగ్ విషయం బయటపడింది. 42 ఏళ్ల టామీ లించ్ ఉదయం నిద్రలేచినప్పుడు, తన శరీరం నీలం రంగులోకి మారిపోవడాన్ని చూసి షాకయ్యాడు. వెంటనే క్వీన్స్ ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్ళాడు. నిమిషాల వ్యవధిలోనే, ఆక్సిజన్ మాస్క్ ధరించిన టామీని పరీక్షించడానికి సుమారు 10 మంది వైద్యులు అక్కడికి చేరుకున్నారు. అత్యవసర చికిత్సకు ఏర్పాట్లు చేస్తుండగా, ఓ డాక్టర్ రక్తం తీయడానికి టామీ చేతిని ఆల్కహాల్ వైప్‌తో తుడిచారు. అప్పుడే ఓ అద్భుతం జరిగింది. ఆ ప్రాంతంలోని నీలం రంగు మాయమైంది. అప్పుడే వైద్యులు ఆ ఘటన వెనుక ఉన్న రహస్యాన్ని కనిపెట్టారు. ఇటీవల టామీకి ఓ స్నేహితుడు నీలం రంగు పరుపు, దుప్పట్లను ఇచ్చాడు. వాటిపై రెండు రాత్రులు పడుకున్న తర్వాత టామీ శరీరం నీలం రంగులోకి మారిపోయింది. ఇలా జరగడానికి ఆ పరుపు, దుప్పట్లకు ఉన్న రంగు శరీరానికి అంటుకోవడమే అని తెలిసి టామీ సహా వైద్యులంతా నవ్వుకున్నారు. తొలుత భయపెట్టి, ఆ తర్వాత నవ్వించిన ఘటన సోషల్‌మీడియాలో వైరలైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రీ వెడ్డింగ్ షూట్ లో.. పిచ్చి పీక్స్‌కు.. నెట్టింట ట్రోల్ అవుతున్న వీడియో