యాక్సిడెంట్లు అనేవి ఎవరూ ఊహించనవి.. ఎప్పుడు.. ఎక్కడ.. ఏ విధంగా ప్రమాదం జరుగుతుందో తెలియదు..కానీ, జరిగిన క్షణాల్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటాయి. కొన్ని ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపితే.. మరి కొన్ని నవ్వులు పూయిస్తాయి. ఇలాంటి ప్రమాదమే ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
నగరంలోని రావిచెట్టు బజార్లో ఓ బట్టల షాపులో షాపులో కస్టమర్లు బట్టలు కొనేందుకు వెళ్లారు. వాళ్ల పనిలో వాళ్లున్నారు. ఉన్నట్టుండి సడెన్‌గా షాప్‌లోకి ఓ బైక్ దూసుకొచ్చింది. షాపు బయటినుంచి ఏదో వేగంగా వస్తోందని కండ్లు తిప్పేలోపుగానే… ఓ బైకర్ గుండె ఆగిపోయినంత పనిచేశాడు. పల్సర్ బైక్ మీద అతివేగంతో నేరుగా షాపులోకి దూసుకొచ్చాడు. షాపులో పేర్చిన బట్టలను ఢీ కొట్టి ఎగిరిపోయి కౌంటర్లో పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి, బైక్‌కు ఏమీ కాకపోగా.. షాపులోని వారు తృటిలో తప్పించుకున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సూపర్ డ్రైవింగ్ అంటూ పలువురు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..