యువకుడి కిడ్నాప్.. డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా పెళ్లి..

Updated on: Feb 13, 2026 | 10:52 AM

బీహార్‌లో దారుణం! పోలీస్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న యువకుడిని కిడ్నాప్ చేసి, డ్రగ్స్ ఇచ్చి బలవంతంగా పెళ్లి చేశారు. ఈ ఘటన సమస్తీపూర్‌ జిల్లాలో జరిగింది. పెళ్లి వీడియో వైరల్‌గా మారడంతో పోలీసులు అతడిని రక్షించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువకులను లక్ష్యంగా చేసుకుని బీహార్‌లో జరిగే 'పకద్వా వివాహ్'ల భయంకర వాస్తవాలను ఈ ఘటన మరోసారి వెలుగులోకి తెచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బీహార్ లో పోలీస్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడికి దారుణమైన అనుభవం ఎదురైంది. కొంతమంది వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేశారు. డ్రగ్స్ ఇచ్చి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. సమస్తీపూర్‌ జిల్లా జోడి పఖర్ గ్రామానికి చెందిన నితీశ్ కుమార్ ‘బిహార్ పోలీస్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్’ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అలీ గ్రామానికి చెందిన శంకర్ రాయ్ కుటుంబం కన్ను నితీశ్ మీద పడింది. అతడిని తమ ఇంటి అల్లుడిని చేసుకోవాలని వారు భావించారు. నితీశ్ కుమార్ లైబ్రరీకి వెళుతుండగా శంకర్ రాయ్ కుటుంబసభ్యులు అతడిని కిడ్నాప్ చేశారు. బాగా కొట్టి, డ్రగ్స్ ఇచ్చి మోర్వాలోని గుడి దగ్గరకు తీసుకెళ్లారు. బలవంతంగా శంకర్ రాయ్ కూతురు లక్ష్మీ కుమారితో పెళ్లి చేశారు. తర్వాత అతడ్ని ఇంట్లో బంధించారు. అయితే, పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వీడియో చూసిన సమస్తీపూర్ పోలీస్ అధికారులు శంకర్‌రాయ్ ఇంటికి వెళ్లారు. నితీశ్‌ను అక్కడినుంచి బయటకు తీసుకువచ్చారు. నితీశ్ జరిగిందంతా పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పాడు. తనను కిడ్నాప్ చేసి, బలవంతంగా పెళ్లి చేసిన వారిపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, బిహార్ రాష్ట్రంలో ‘పకడ్వా వివాహ్‌’లు తరచుగా జరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ చేస్తున్న, ఉన్నత చదువులు చదివిన యువకులే టార్గెట్‌గా బలవంతపు పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఒక్క 2009 సంవత్సరంలోనే ఏకంగా 1224 బలవంతపు పెళ్లిళ్లు జరిగాయి. అమ్మాయిల తరఫు వారు ఆయుధాలతో బెదిరించి యువకులకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్య సీక్రెట్ లైఫ్‌ను బయటపెట్టిన ఆధార్‌ ఓటీపీ

IRCTC: రైలు ప్రయాణికులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక మీకు కావాల్సింది సీట్ వద్దకే

ఎలుగుబంట్ల బీభత్సం.. వణికిపోతున్న గ్రామ ప్రజలు

OTT ట్రెండింగ్‌లో ఎప్‌స్టీన్ వెబ్ సిరీస్‌.. రసవత్తరంగా సాగే కథ

Kona Venkat: కంటెంట్ ఉంటే.. సినిమా హిట్టే..