little boy cute words: ఈ బుడ్డోడి క్యూట్‌ మాటలు వింటే ఫిదా అవ్వక మానరు..! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో…

Updated on: Nov 05, 2021 | 8:04 AM

కల్మషం లేని అందమైన మనస్సుకు చిన్న పిల్లలు పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా వచ్చీ రానీ మాటలతో వారు పలికే ముద్దు ముద్దు పలుకులు ఫిదా చేస్తుంటాయి. ఎంత బాధలో ఉన్నా సరే కాసేపు చిన్న పిల్లలతో గడిపితే ఎంతో హాయిగా ఫీలవుతారు.


కల్మషం లేని అందమైన మనస్సుకు చిన్న పిల్లలు పెట్టింది పేరు. మరీ ముఖ్యంగా వచ్చీ రానీ మాటలతో వారు పలికే ముద్దు ముద్దు పలుకులు ఫిదా చేస్తుంటాయి. ఎంత బాధలో ఉన్నా సరే కాసేపు చిన్న పిల్లలతో గడిపితే ఎంతో హాయిగా ఫీలవుతారు. అంతలా ఆకట్టుకుంటాయి చిన్న పిల్లల మాటలు. తాజాగా నెట్టింట అలాంటి ఓ కుర్రాడి బుజ్జి బుజ్జి పలుకులు వైరల్ అవుతున్నాయి. ఈ కుర్రాడి మాటలు విన్న నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. సుమారు ఓ రెండేళ్ల వయసున్న కుర్రాడికి తల్లి బువ్వ పెట్టడానికి తీసుకెళ్తూ… ‘నువ్వు రోటి సబ్జీ తింటావా.? లేదా అన్నం, పప్పు తింటావా?’అని అడుగుతుంది. దానికి ఆ కుర్రాడు.. ‘నో.. నో థ్యాంక్యూ నేను అది తినను. నేను కేక్ తింటాను. ఈ ఒక్కసారికి కేక్‌ తింటాను’అంటాడు. ఆ చిన్నారి వచ్చి రానీ మాటలతో పలికిన ఆ పలుకులు మెస్మరైజ్‌ చేస్తున్నాయి. ఆ తల్లీ కొడుకుల క్యూట్‌ సంభాషణను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆ కుర్రాడు అడిగిన తీరు చూస్తుంటే ఒక్క కేక్‌ ఏంటి.? వంద కేకులు అయినా ఇచ్చేయాల్సిందే అంటూ కామెంట్‌ చేస్తున్నారు. మరి ఆ బుడ్డోడి క్యూట్‌ క్యూట్ మాటలను మీరూ ఓ సారి వినేయండి..

మరిన్ని చదవండి ఇక్కడ: Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Hebah Patel: ఏంజెల్ లా మెరుస్తున్న ‘హెబ్బా పటేల్’.. ఇలా చుస్తే ఎవరైనా పడిపోవాల్సిందే.. (ఫొటోస్)

Rashid stunning catch: రషీద్‌ స్టన్నింగ్ క్యాచ్‌.! ఫిదా అవున్నారు నెటిజన్స్‌.. వైరల్ అవుతున్న వీడియో…

Loading...
Unable to load recommendations.
Follow Us