Watch Video: ఎండుతున్న చెరువుపై స్థానికుల దండయాత్ర.. చివరకు జరిగిందిదే..

| Edited By: Srikar T

Mar 22, 2024 | 11:23 AM

ఎండ దెబ్బకు చెరువు ఎండిపోయేలా ఉంది. ఇంకేముంది చేపల కోసం వందలాది మంది చెరువుపై దాడిచేశారు. చేతికి అందిన కాడికి చేపలు పట్టుకొని పండగ చేసుకున్నారు. చేపల ప్రియులు చెరువు లూఠీ చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో చోటు చేసుకుంది. కాళేశ్వరం సమీపంలోని పడిదం చెరువులో పూర్తిగా నీటిమట్టం తగ్గింది.

ఎండ దెబ్బకు చెరువు ఎండిపోయేలా ఉంది. ఇంకేముంది చేపల కోసం వందలాది మంది చెరువుపై దాడిచేశారు. చేతికి అందిన కాడికి చేపలు పట్టుకొని పండగ చేసుకున్నారు. చేపల ప్రియులు చెరువు లూఠీ చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో చోటు చేసుకుంది. కాళేశ్వరం సమీపంలోని పడిదం చెరువులో పూర్తిగా నీటిమట్టం తగ్గింది. వేసవి ప్రభావంతో మరికొద్ది రోజుల్లో చెరువు పూర్తిగా ఎండి పోయే పరిస్థితి ఏర్పడింది. చెరువు ఎండిపోతే అందులోని జలచరాలు చనిపోయే ప్రమాదం ఉంది. దీంతో స్థానికులు, జాలర్లు చెరువును జల్లడ పడ్డారు. కొంతమంది వలలతో చేపల వేట సాగిస్తే మరికొంత మంది ఇతర చీరలతో చేపలను పట్టి పండుగ చేసుకున్నారు. వందలాది మంది గ్రామస్థులు ఒక్కసారిగా చెరువుపై పడడంతో అందులోని చేపలన్ని మాయమయ్యాయి. చేపల ప్రియులు మాత్రం పండుగ చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow us on