Viral Video: సమోసాలు కొనలేదని భర్తను కొట్టించిన భార్య! వీడియో

Updated on: Sep 08, 2025 | 9:02 PM

ఇప్పుడే పెండ్లం మొగలన్నకాడ ఏ యింట్లైనా కూర మంచిగలేదనో..ఉప్పెక్వైందనో..ఉప్పు తక్వైందనో..ఊకే అదే కూరనో ఏదో లొల్లి కచ్చితంగైతది..కాని ఓకాడ పెండ్లం మొగల నడ్మ ఒక్క సమోసా పెద్ద కయ్యం పెట్టిచ్చింది.. మీరు నమ్మరు నాకెర్కే..కాని నిజంగ నిజమే.. సమోస తేలేదని మొగన్ని పంచాదికి పిల్పిచ్చి.. పండ్లురాలేతట్టు కొట్టిచ్చిందో ఓ ఆదర్శ ఇల్లాలు.

కెరెర్మీద పోకస్ పెట్టకుంటే గిసోంటి పంచాదులే అస్తయి..అందుకే పచ్చళ్లక్క ఎప్పుడో చెప్పింది.. భార్యకు ముస్టి పచ్చడే కొనియ్యలేకపోతున్నవ్..రేపు బంగారం అడ్గుతే ఏం కొనిస్తవ్రా…అని మోటివేషన్ ఇచ్చింది గద..యూపీలున్న ఫిలిబిత్ జిల్లా పురాన్ పూర్ల గసోంటి ముచ్చటే అయింది. సమోసా అడ్గుతే తేలేదన్న కోపంతోటి ఏకంగ మొగున్మీద పంచాదే పెట్టిచ్చింది.. అవ్వొయ్యలను పిల్పిచ్చి మొగడ్ని పొట్టు పొట్టు తోమిచ్చింది ఓ ఇల్లాలు.

Published on: Sep 08, 2025 09:02 PM
Loading...
Unable to load recommendations.
Follow Us