భర్త నాలుకను కొరికి నమిలేసిన భార్య.. ఆ తర్వాత ఆస్పత్రిలో మరో సీన్..

Updated on: Jul 30, 2025 | 12:40 PM

బీహార్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.. భార్యాభర్తల మధ్య గొడవలు హద్దు మీరితే పరిణామాలు ఎంత తీవ్రతకు దారితీస్తాయో చెప్పే ఈ విచిత్ర సంఘటన బిహార్‌లోని గయలో కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం... బీహార్ ఖిజ్రాసరాయ్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ దంపతుల మధ్య చిన్న గొడవ తలెత్తింది. దీంతో ఇద్దరూ దుర్భాషలాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో మాటా మాటా పెరిగి.. తీవ్ర ఘర్షణగా మారింది.

ఈ క్రమంలోనే.. భార్య ఆగ్రహంతో ఊగిపోతూ.. భర్త నాలుకను కొరికి కరకర నమిలి మింగేసింది. దీంతో తీవ్రమైన రక్తస్రావంతో భర్త అక్కడికక్కడే కుప్పకూలాడు. భర్త ఆరోగ్య పరిస్థితి విషమించడం చూసి.. కుటుంబసభ్యులు, గ్రామస్తులు కలిసి అతడిని సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే.. చాలా రక్తం పోవడంతో.. అతనికి ప్రాథమిక చికిత్స చేసి మగధ్‌ వైద్య కళాశాలకు సిఫారసు చేసినట్లు డాక్టర్‌ మీనారాణి వెల్లడించారు.. వెంటనే అక్కడి నుంచి తరలించామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఆసుపత్రిలో కూడా భార్యాభర్తలు రెచ్చిపోయారు. ఇంత జరిగి ఆస్పత్రిపాలైనా అక్కడ కూడా భార్యాభర్తలు గొడవపడ్డారని.. స్థానికులు తెలిపారు. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా? వీడియో

వరుణ్ బర్త్ డే.. భార్య ఇచ్చిన గిఫ్ట్ చూసి ఒక్కసారిగా షాక్ వీడియో

ర్యాపిడో రైడ్‌లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన యువతి..! డ్రైవర్‌ చేసిన పనితో వీడియో