సిగరెట్ మానేస్తే.. మీ అకౌంట్ లో లక్షలకు లక్షలు..ఎలాగో తెలుసా?

Updated on: Apr 22, 2026 | 2:59 PM

రోజు మనం ఒక సీరియస్ విషయం గురించి మాట్లాడుకుందాం. సిగరెట్ ప్యాకెట్ మీద 'పొగాకు ప్రాణాంతకం' అని రాసి ఉంటుంది. అది చూసి కూడా లైట్ తీసుకుంటాం. 'ఏదో ఒక రోజు చావక తప్పదు కదా' అని జోకులు వేసుకుంటాం. కానీ మీకు తెలుసా? పొగాకు కేవలం మీ ఊపిరితిత్తులను మాత్రమే కాదు.. మీ ఇంటి ఆర్థిక పునాదులను, మీ పిల్లల భవిష్యత్తును, మీ గౌరవప్రదమైన జీవితాన్ని కూడా సర్వనాశనం చేస్తోంది.

ఇది నేను చెబుతున్న మాట కాదు.. భారతదేశపు అత్యున్నత పరిశోధనా సంస్థలు ICMR, TISS కలిసి చేసిన ఒక సంచలన సర్వేలో తేలిన నిజం. ఈ సర్వే ప్రకారం, కేవలం పొగాకు మానేయడం వల్ల భారతదేశంలో 2 కోట్ల కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయట! ఇది ఎలా సాధ్యం? ఒక అలవాటు మారితే ఒక దేశపు ఆర్థిక వ్యవస్థ మారుతుందా? ఈ అంశంపై పూర్తి వివరాలు తెలుసుకుందాంఈ పరిశోధన ఏదో కొద్దిమందితో చేసింది కాదు. నోయిడాలోని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్, ముంబైలోని ప్రతిష్టాత్మక టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ శాస్త్రవేత్తలు కలిసి 2 లక్షల 61 వేల 746 కుటుంబాల డేటాను విశ్లేషించారు. 2022-23 గృహ వినియోగ వ్యయ సర్వే ఆధారంగా ఈ రిపోర్ట్ సిద్ధం చేశారు. ఈ రిపోర్ట్ ‘BMJ గ్లోబల్ హెల్త్’ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమైంది. ఇందులో తేలిన విషయం ఏమిటంటే.. పొగాకు అనేది కేవలం ఆరోగ్య సమస్య కాదు, అదొక ‘పేదరికపు ఉచ్చు’

మరిన్ని వీడియోల కోసం :

సడన్‌గా సైలెంట్ అయిన డార్లింగ్‌.. రీజనేంటి?

పూరి @26..మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతారా..?

పాన్ ఇండియా హిట్‌ వరమా..శాపమా?

ఊరిస్తున్న ఒక్క పాట.. పెద్ది టీమ్ ప్లానేంటి?

సమ్మర్‌ హీట్‌.. లైట్‌ అంటున్న స్టార్స్‌

Follow Us