అంతరిక్షంలో గూఢచర్యం.. భారత్ కు ఇప్పుడు ఈ సత్తా కూడా ఉంది
దేశీయంగా అభివృద్ధి చేసిన శాటిలైట్‌తో అంతరిక్షంలోని ఇతర వస్తువులను అత్యంత స్పష్టంగా ఫొటోలు తీసి అహ్మదాబాద్‌కు చెందిన ఆజిస్టా ఇండస్ట్రీస్ అరుదైన ఘనత సాధించింది. అంతరిక్ష రంగంలో భారత సత్తా మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఈ విజయంతో భారత్‌కు 'ఇన్-ఆర్బిట్ స్నూపింగ్' చేసే సామర్థ్యం లభించినట్లయింది. అంటే, ఇకపై అంతరిక్షంలో శత్రు దేశాల ఉపగ్రహాలపై నిఘా పెట్టడం సాధ్యమవుతుంది.
దేశీయంగా అభివృద్ధి చేసిన శాటిలైట్‌తో అంతరిక్షంలోని ఇతర వస్తువులను అత్యంత స్పష్టంగా ఫొటోలు తీసి అహ్మదాబాద్‌కు చెందిన ఆజిస్టా ఇండస్ట్రీస్ అరుదైన ఘనత సాధించింది. అంతరిక్ష రంగంలో భారత సత్తా మరోసారి ప్రపంచానికి తెలిసింది. ఈ విజయంతో భారత్‌కు ‘ఇన్-ఆర్బిట్ స్నూపింగ్’ చేసే సామర్థ్యం లభించినట్లయింది. అంటే, ఇకపై అంతరిక్షంలో శత్రు దేశాల ఉపగ్రహాలపై నిఘా పెట్టడం సాధ్యమవుతుంది. ఆజిస్టా సంస్థకు చెందిన 80 కిలోల బరువున్న ఎబిఎ ఫస్ట్ రన్నర్ శాటిలైట్ ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఫిబ్రవరి 3న భూమికి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSను ఈ శాటిలైట్ రెండుసార్లు ఫొటోలు తీసింది. మొత్తం 15 ఫ్రేమ్‌లను సేకరించగా, ఇమేజ్ రిజల్యూషన్ దాదాపు 2.2 మీటర్లుగా నమోదైంది. ఈ రెండు ప్రయత్నాల్లోనూ 100 శాతం విజయం సాధించడం, ఆజిస్టా అభివృద్ధి చేసిన స్వదేశీ ట్రాకింగ్ అల్గారిథమ్‌లు, ఎలక్ట్రో-ఆప్టికల్ ఇమేజింగ్ వ్యవస్థల కచ్చితత్వాన్ని నిరూపించింది. ప్రస్తుతం భూ కక్ష్యలో ఉపగ్రహాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. జామింగ్, సిగ్నల్స్‌కు అంతరాయం కలిగించడం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇలాంటి సమయంలో స్పేస్ సిచువేషనల్ అవేర్‌నెస్ (SSA) సామర్థ్యం దేశ భద్రతకు అత్యంత కీలకం. భారత్ ప్రస్తుతం కమ్యూనికేషన్, నావిగేషన్, వ్యూహాత్మక అవసరాల కోసం రూ.50,000 కోట్లకు పైగా విలువైన 50కి పైగా ఉపగ్రహాలను నిర్వహిస్తోంది. ఈ తాజా సామర్థ్యంతో మన అంతరిక్ష ఆస్తులను కాపాడుకోవడం సులభతరం అవుతుంది. AFR ఉపగ్రహాన్ని 2023 జూన్ 13న స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ శాటిలైట్ ఇప్పటికే 2.5 సంవత్సరాల జీవితకాలాన్ని పూర్తి చేసుకుని, మరో 2.5 ఏళ్లు పనిచేయనుంది. భవిష్యత్తులో 25 సెంటీమీటర్ల రిజల్యూషన్‌తో ఫొటోలు తీయగల పేలోడ్‌లను అభివృద్ధి చేస్తామని, బాలిస్టిక్ క్షిపణులను ట్రాక్ చేయడం వంటి రక్షణ అవసరాలకూ ఇది ఉపయోగపడుతుందని ఆజిస్టా ప్రకటించింది. ఇస్రో ప్రయోగాలకు అదనంగా, ప్రైవేట్ రంగం సాధించిన ఈ విజయం భారత అంతరిక్ష రక్షణ సామర్థ్యాలను మరింత పటిష్ఠం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రక్తం మడుగులో భారతీయ విద్యార్థులు.. రష్యా స్టూడెంట్స్ హాస్టల్‌లో టీనేజర్ ఘాతుకం
Harsha Veena: పవన్ సార్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్.. మీ దగ్గర మొత్తం బయట పెడత
స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్