BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా!

Updated on: Jul 14, 2026 | 5:43 PM

సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌లు అందని ప్రాంతాల్లోనూ కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1.34 లక్షల శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ను సామాన్యులకు కాకుండా డిఫెన్స్, మారిటైమ్, డిజాస్టర్ రెస్పాన్స్, మైనింగ్, రిమోట్ ఆపరేషన్స్ నిపుణుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. రగ్గడ్ డిజైన్, భారీ బ్యాటరీతో రూపొందించిన ఈ ఫోన్ అత్యవసర పరిస్థితుల్లో నిరంతర కమ్యూనికేషన్‌కు కీలకంగా ఉపయోగపడనుంది.

సంప్రదాయ మొబైల్ నెట్‌వర్క్‌లు అస్సలు పనిచేయని మారుమూల ప్రాంతాల్లో సైతం అప్రతిహతంగా కనెక్టివిటీని అందించేందుకు ప్రభుత్వరంగ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధరను రూ.1.34 లక్షలుగా నిర్ణయించినట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ ఫోన్‌ను సాధారణ పౌరులందరికీ విక్రయించరు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ కాల్స్‌, ఎస్సెమ్మెస్‌లు చేసుకునేందుకు వీలుగా రూపొందించిన ఈ ఫోన్‌ను.. కేవలం డిఫెన్స్‌, మారిటైమ్‌, డిజాస్టర్‌ రెస్పాన్స్‌ , మైనింగ్, రిమోట్ ఆపరేషన్స్‌, అడ్వెంచర్‌ ట్రావెల్‌ చేసే నిపుణులకు మాత్రమే విక్రయిస్తారు. చూడ్డానికి సాధారణ ఫీచర్‌ ఫోన్‌ మాదిరిగా ఉన్నప్పటికీ, క్లిష్ట పరిస్థితులను తట్టుకునే రగ్గ్‌డ్‌ డిజైన్‌తో, అత్యధిక సమయం బ్యాకప్ ఇచ్చే బిగ్‌ బ్యాటరీతో దీనిని తయారు చేశారు. ఈ ఫోన్‌ కావాలనుకునే అర్హులు తమ అవసరాన్ని తెలియజేస్తూ స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్‌ కేంద్రాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. లేదా హెల్ప్‌లైన్ నంబర్ 94651 01323 కు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు ఈ సాంకేతికత ఎంతో ఉపయోగపడనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు

స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం

Follow Us