బుడ్డోడిని పట్టించుకోరా? సెలక్టర్ల పై కృష్ణమాచారి శ్రీకాంత్ ఫైర్
మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ భారత జట్టు ఎంపిక విధానంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, వికెట్ కీపర్ సంజూ శాంసన్‌లను పక్కన పెడుతున్న తీరుపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. వైభవ్, సంజూలకు నిలకడగా అవకాశాలు ఇవ్వకపోవడం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.
భారత క్రికెట్ జట్టు ఎంపిక విధానంపై మాజీ క్రికెటర్, చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని, వికెట్ కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్‌లను జట్టులో పక్కన పెడుతున్న తీరుపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించడం పట్ల శ్రీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ శ్రీకాంత్, చివరి సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన ఆటగాడిని ఎలా పక్కన పెడతారంటూ తన భార్య ప్రశ్నించినట్లు వెల్లడించారు. వైభవ్‌ను సరిగ్గా ట్రీట్ చేయడం లేదని, ఇది ఆటగాళ్లలో భయాన్ని కలిగించడమే కాకుండా వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దులీప్ ట్రోఫీ, ఐపీఎల్, ఇండియా ఏ వంటి అన్ని స్థాయిల్లోనూ నిలకడగా రాణిస్తున్న వైభవ్‌ను ఇలా డ్రాప్ చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వయసు దాటిన ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఇక.. 44 ఏళ్లొచ్చినా సర్కార్ నౌకరీకి అర్హులే
