మనీ మెషీన్‌! 90 నిమిషాల్లో రూ.30 కోట్లు సంపాదన

Updated on: Jun 14, 2026 | 4:50 PM

ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సంపాదన మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సౌదీ క్లబ్ ఒప్పందం ద్వారా ఏడాదికి వేల కోట్ల రూపాయలు ఆర్జిస్తున్న రొనాల్డో, ఒక మ్యాచ్‌కు సుమారు రూ.30 కోట్లు సంపాదిస్తున్నట్లు అంచనా. రెండు దశాబ్దాల కెరీర్, స్పాన్సర్‌షిప్‌లు, వ్యాపార పెట్టుబడులు, సోషల్ మీడియా ప్రభావంతో ఆయన ప్రపంచ క్రీడా రంగంలో అత్యంత ధనవంతులలో ఒకరిగా నిలిచారు.

ఫిఫా ప్రపంచకప్ మొదలు కానుంది. ప్రపంచ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. దశాబ్దాలుగా ఫుట్ బాల్‌ ఆటను ప్రేమించి ప్రపంచాన్ని ఏలిన దిగ్గజాలకు క్రీడాకారులకు ఇదే చివరి ప్రపంచకప్ కాబోతోంది. మెస్సీ, రొనాల్డో, లూకా, థామస్ ముల్లర్ , నెయ్‌మార్ వీరిలో ఉన్నారు. అయితే పోర్చుగల్ స్టార్ రొనాల్డో వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నాడు. ఆతని సంపాదన పై చర్చ నడుస్తోంది. రొనాల్డో ఫుట్‌బాల్ మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ, గడియారం లెక్కలు పూర్తిగా మారిపోతాయి. అతని 90 నిమిషాల ఆట ఖరీదు దాదాపు రూ.30 కోట్ల రూపాయలు. అంటే ఏడాదికి రూ.12 లక్షలు సంపాదించే భారతీయ జీతగాడికి అంత సంపాదించాలంటే 250 ఏళ్లు పడుతుంది. 41 ఏళ్ల పోర్చుగీస్ ఫుట్‌బాలర్ రొనాల్డో కేవలం తన సౌదీ క్లబ్ డీల్ ద్వారానే ఏడాదికి 20 కోట్ల డాలర్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. అంటే..ఏడాదిలో 1,900 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. క్లబ్ తరపున దేశం తరఫున ఒక సీజన్‌లో 55 మ్యాచ్‌లు ఆడుతారని అనుకుందాం. వార్షిక సంపాదనను 55తో భాగిస్తే వచ్చే అంకె అద్భుతంగా ఉంటుంది: అతను ఆడే ప్రతి మ్యాచ్‌కి దాదాపు రూ. 30 కోట్లు తీసుకుంటాడు. మరోలా చెప్పాలంటే, 90 నిమిషాల ఫుట్‌బాల్ ఆట, అనేక భారతీయ కంపెనీలు తమ ఉద్యోగులందరికీ కలిపి ఏడాది మొత్తానికి కేటాయించే జీతాల బడ్జెట్‌తో సమానమైన డబ్బును ఆయనకు అందిస్తుంది. రొనాల్డో నికర ఆస్తి విలువ 120 కోట్ల డాలర్లు అంటే దాదాపు 10,000 కోట్లు. అపార సంపద రాత్రికి రాత్రే వచ్చింది కాదు. రెండు దశాబ్దాలకు పైగా ఛాంపియన్స్ లీగ్ బోనస్‌లు, ఇమేజ్ రైట్స్, స్పాన్సర్‌షిప్ డీల్స్, వ్యాపార పెట్టుబడులు, అనేక దేశాల జనాభా కంటే ఎక్కువున్న సోషల్ మీడియా ఫాలోయింగ్‌ను డబ్బుగా మార్చుకోవడం ద్వారా ఈ సామ్రాజ్యం సాధ్యమైంది. ఒక మ్యాచ్‌కు రొనాల్డో సంపాదన దాదాపు రూ.30 కోట్లు. వార్షిక జీతం రూ. 12 లక్షలు సంపాదించే భారతీయ ఉద్యోగి 40 ఏళ్ల పాటు కెరీర్‌ను కొనసాగించినా ఆ ఆస్తిలో ఒక చిన్న భాగానికి కూడా సరితూగడు.. రొనాల్డో నికర ఆస్తికి సమానంగా సంపాదించాలంటే రూ. 12 లక్షల వార్షిక జీతం ఆర్జించే సుమారు 2 వేలమందికి సమానం. ఏడాదికి సుమారు 2,000 ఆఫీసు పని గంటల చొప్పున లెక్కిస్తే, అది దాదాపు 16 నుండి 17 కోట్ల గంటల శ్రమతో సమానం. రొనాల్డో మైదానంలో గడిపే ప్రతి మ్యాచ్ లో గంటకు రూ. 20 కోట్లు సంపాదిస్తాడు. మరో మాటలో చెప్పాలంటే, ఆధునిక ఫుట్‌బాల్ ప్రపంచంలో అత్యున్నత శిఖరం 90 నిమిషాల ఫుట్‌బాల్, దానికి అదనంగా స్టాపేజ్ టైమ్ కలిపితే వచ్చే డబ్బు, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పనిచేసే ఉద్యోగుల శతాబ్దాల శ్రమతో సమానం అన్నమాట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ వీడియోలే వరుడికి విలన్‌లయ్యాయి.. షాక్ తిన్న పెళ్లి బృందం!

రైతులకు మేలు చేసే వయ్యారి భామ మళ్లీ దర్శనం..!

Follow Us