Gas Cylinder Blast: టపాసుల్లా పేలిన గ్యాస్‌ సిలిండర్లు.. ఇళ్లు బుగ్గిపాలు

Updated on: Apr 15, 2026 | 7:03 PM

సంగారెడ్డి జిల్లాలో ఆదివారం రెండు గ్యాస్ ప్రమాదాలు తీవ్ర కలకలం రేపాయి. కల్వకుంటలో అక్రమంగా సిలిండర్లు నిల్వ ఉంచడంతో గ్యాస్ లీకై నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పుల్కల్‌లో సిలిండర్ పేలి ఇద్దరు నిరుపేదల ఇళ్లు కాలి బూడిదయ్యాయి. గ్యాస్ వినియోగం, నిల్వలో అజాగ్రత్త ఎంత ప్రమాదకరమో ఈ ఘటనలు హెచ్చరిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు గ్యాస్ ప్రమాదాలు స్థానికులను ఉలిక్కిపడేలా చేశాయి. ఒకచోట అజాగ్రత్త నలుగురి ప్రాణాల మీదకు తెస్తే, మరోచోట సిలిండర్ పేలుడు సామాన్యుడి గూడును బుగ్గిపాలు చేసింది. సంగారెడ్డి పట్టణంలోని కల్వకుంటలో భారీ ప్రమాదం తప్పింది. గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న సంగమేశ్వర్, నిబంధనలకు విరుద్ధంగా తన ఇంట్లోనే 15 సిలిండర్లను నిల్వ ఉంచాడు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో ఇంటి పైకప్పు రేకులు గాలిలోకి ఎగిరిపడ్డాయి. ఈ ప్రమాదంలో సంగమేశ్వర్, అతని తల్లి, అన్న కూతురు మరియు సహాయకుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్ పగిలి నీరు పడటంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు భావిస్తున్నారు. మరో ఘటనలో పుల్కల్ గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరి ఇళ్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అవుసలి లక్ష్మణ్ అనే వ్యక్తి తన గుడిసెలో నివసిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. ఈ ధాటికి లక్ష్మణ్ గుడిసెతో పాటు పక్కనే ఉన్న మరో ఇల్లు కూడా కాలిపోయింది. కళ్ల ముందే గూడు ఛిద్రం కావడంతో ఆ నిరుపేద కుటుంబం రోడ్డున పడింది. ఒకే రోజు జరిగిన ఈ రెండు ఘటనలు గ్యాస్ వినియోగంలోనూ, నిల్వలోనూ అజాగ్రత్త వహిస్తే ఎంతటి మూల్యం చెల్లించుకోవాలో హెచ్చరిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Iran Oil Tankers: భారత్‌కు చేరిన ఇరాన్‌ ఆయిల్ ట్యాంకర్‌లు

రైలులో 163 మంది చిన్నారుల అక్రమ రవాణా

బుక్ చేసి వారమైనా గ్యాస్‌ సిలిండర్‌ రాలేదా? ఘోస్ట్ డెలివరీయే కారణమా?

Vande Bharat Sleeper: దక్షిణాదికి తొలి వందే భారత్ స్లీపర్.. ఆ మార్గంలోనే ప్రయాణం

ఆధునికతతో అంతరించిపోతున్న మట్టి పాత్రలు.. కుమ్మరుల జీవనం

Follow Us