Telangana: డబ్బులు కట్టేందుకు బ్యాంక్‌కి వెళ్లగా.. క్యాషియర్ చేసిన పనికి సీన్ కాస్తా సితారయ్యింది.!

|

May 10, 2024 | 5:01 PM

తమ గ్రూప్ డబ్బు బ్యాంక్‌లో కట్టాలని ఓ వ్యక్తి ఏటీఎంకి వెళ్లాడు. తనకు కావాల్సిన నగదును మొత్తం ఏటీఎం నుంచి విత్‌డ్రా చేశాడు. ఇక ఆ డబ్బును బ్యాంకులో కట్టేందుకు వెళ్లగా.. అక్కడి బ్యాంక్ ఉద్యోగి నోట్లన్నీ లెక్కపెట్టి.. ఒకటి దొంగ నోటు ఉందని చెప్పడంతో దెబ్బకు షాక్ అయ్యాడు బాధితుడు.

తమ గ్రూప్ డబ్బు బ్యాంక్‌లో కట్టాలని ఓ వ్యక్తి ఏటీఎంకి వెళ్లాడు. తనకు కావాల్సిన నగదును మొత్తం ఏటీఎం నుంచి విత్‌డ్రా చేశాడు. ఇక ఆ డబ్బును బ్యాంకులో కట్టేందుకు వెళ్లగా.. అక్కడి బ్యాంక్ ఉద్యోగి నోట్లన్నీ లెక్కపెట్టి.. ఒకటి దొంగ నోటు ఉందని చెప్పడంతో దెబ్బకు షాక్ అయ్యాడు బాధితుడు. ఈ ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పద్మావతి నగర్‌లో ఉన్న ఏటీఎంలో గురువారం గంగాధర్ అనే వ్యక్తి రూ. 8500 డబ్బులు విత్‌డ్రా చేశాడు. బ్యాంక్‌లో గ్రూపు డబ్బులు కట్టేందుకు.. ఆ డబ్బును కాస్తా బ్యాంక్‌కు తీసుకెళ్లాడు. ఆ డబ్బులు బ్యాంక్‌లో కట్టగా.. ఒక్క నోటు డూప్లికేట్‌ది వచ్చిందని.. నోటుపై గీతలు గీసి సదరు బాధితుడి చేతిలో పెట్టాడు క్యాషియర్. సదరు బాధితుడు క్యాష్ విత్‌డ్రా చేసిన ఏటీఎం దగ్గరకు వెళ్లి.. విషయాన్ని వివరించగా.. ఆ నోటుతో తమ బ్యాంకుకు సంబంధం లేదని అక్కడి అధికారులు చెప్పినట్టు వాపోయాడు. ఆటో డ్రైవర్‌గా జీవిస్తున్న తనకు దొంగ నోటు రావడంతో ఒకరోజు సంపదన పోయిందని వాపోయాడు బాధితుడు. ఇలాంటి ఘటన ఇంకా ఎవరికి జరగకూడదని బాధితుడు అన్నాడు.

Follow us on