Watch Video: అండమాన్ నికోబర్‎లో శ్రీకాకుళం మత్స్యకారుల ఆందోళన.. అసలు కారణం ఇదే..

|

Jul 11, 2024 | 1:27 PM

అండమాన్‌ నికోబర్‌లో శ్రీకాకుళంజిల్లాకు చెందిన మత్స్యకారులు ఆందోళనకు దిగారు. శ్రీకాకుళంజిల్లా సోంపేట మండలం ఇసకలపాలెంకు చెందిన వివాహిత విమల జ్వరంతో బాధపడుతూ చికిత్సకోసం అండమాన్‌లోనీ జీబీ పంత్ ప్రభుత్వాస్పత్రిలో చేరింది. అయితే చికిత్స పొందుతూ విమల చనిపోయింది. దాంతో విమల మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబసభ్యులు, శ్రీకాకుళంజిల్లా వలస కుటుంబాలు ఆందోళనకు దిగారు.

విమల కుటుంబానికి న్యాయం జరిగేవరకు మృతదేహాన్ని తీసుకెళ్లబోమంటూ ఆస్పత్రి దగ్గరే మత్స్యకాలు ఆందోళన చేపట్టారు. విమల కుటుంబానికి అండమాన్‌ నికోబార్‌లోని శ్రీకాకుళంజిల్లా వలస కార్మికులు, తెలుగు సంఘాలు మద్దతుగా నిలిచాయి. నిన్న స్థానిక లెఫ్టినెంట్ గవర్నర్‌ కార్యాలయం నుంచి గోల్‌ఘర్‌ జంక్షన్‌ వరకూ భారీ ర్యాలీ చేపట్టారు మత్స్యకారులు. అయితే ఆందోళన చెందిన వారిపై అండమాన్‌ పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో అండమాన్‌లోని తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అండమాన్‌ నికోబార్‌లోని పరిస్థితులపై శ్రీకాకుళంజిల్లాలోని వారి కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కుమార్‌లకు విజ్ఞప్తి చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on