KCR: 5 నెలల తర్వాత బిడ్డను చూసి కేసీఆర్ తీవ్ర భావోద్వేగం.. గుండెలకు హత్తుకుని
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టు ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్‌పై బయటకొచ్చిన MLC కల్వకుంట్ల కవిత.. ఎర్రవల్లిలో తన తండ్రిని కలిశారు. ఈ సందర్భంగా భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి.
ఎర్రవెల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు ఆయన తనయ కవిత. భర్త, కుమారుని తో కలిసి వచ్చిన ఆడబిడ్డకు పుట్టినింటిలో ఆత్మీయ స్వాగతం లభించింది. అక్కడి సిబ్బంది దిష్టి తీసి ఇంట్లోకి స్వాగతించారు. కన్న బిడ్డను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు కేసీఆర్.
ఆయన కళ్లల్లో నీటి చెమ్మ కనిపించింది. ఇంట్లోకి వెళ్లిన వెంటనే తండ్రి పాదాలకు నమస్కరించారు కవిత. బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు కేసీఆర్. కేసీఆర్ మోములో చాలాకాలం తర్వాత బిడ్డను చూసిన ఆనందం కొట్టొచ్చినట్లు కనిపించింది.
కవిత రాకతో ఎర్రవెల్లి కేసీఆర్ నివాసంలో సంతోషాలు వెల్లివిరిశాయి. కవిత రాక సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ నాయకులు అక్కడికి చేరుకున్నారు.
కాగా 10 రోజుల పాటు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లోనే ఉండనున్నారు కవిత. పదిరోజుల తర్వాత అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. సహకరించాలని కార్యకర్తలు, అభిమానులకు కవిత విజ్ఞప్తి చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..