ఆ వ్యాఖ్యలకు కొండా సురేఖ క్షమాపణ.. కేటీఆర్ రియాక్షన్ ఏమంటే?

Updated on: Oct 29, 2026 | 6:10 PM

గతంలో తనపై చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కొండా సురేఖ క్షమాపణ కోరడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. నిజం నిలకడ మీదే తేలుతుంది అంటూ వ్యాఖ్యానించారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నవారు భవిష్యత్తులో వరుసగా క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని అన్నారు. ఇంకా క్షమాపణలు చెప్పేవారు చాలామంది ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మాజీ మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పారు. ఇది కేవలం నాటి రాజకీయ పరిస్థితుల మేరకు చేసిన కామెంట్స్‌గా పేర్కొన్నారు. దీనిపై పశ్చాత్తాపం వ్యక్తంచేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్..నిజం నిలకడ మీదే తేలుతుంది అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ వార్తాపత్రిక కూడా క్షమాపణ చెప్పిందని, ఈరోజు కొండా సురేఖ క్షమాపణలు చెప్పారని పేర్కొన్నారు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నవారు భవిష్యత్తులో వరుసగా క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని కేటీఆర్ అన్నారు. ఇంకా క్షమాపణలు చెప్పేవారు చాలామంది ముందువరుసలో ఉన్నారని వ్యాఖ్యానించారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us