2021 trolling food: రసగుల్లా చాట్‌, మ్యాగీ మిల్క్‌ షేక్‌.. 2021లో ట్రోల్ అయిన వంటకాలివే.. వైరల్‌ అవుతున్న వీడియో..
Maggi Milk Shake And Rasagulla Chat 2021 Trolling Foods In This Video

2021 trolling food: రసగుల్లా చాట్‌, మ్యాగీ మిల్క్‌ షేక్‌.. 2021లో ట్రోల్ అయిన వంటకాలివే.. వైరల్‌ అవుతున్న వీడియో..

Updated on: Jan 07, 2022 | 8:52 AM

పుర్రెకో బుద్ధి..జిహ్వకో రుచి’ అన్నట్లు రెగ్యులర్‌గా చేసే వంటకాలు విసుగుపుట్టించాయోమో గత ఏడాది కొందరు వెరైటీ వంటకాలను ప్రయత్నించారు. అంతేకాదు మీరు ఈ వంటకాలను ట్రై చేయండంటూ సోషల్‌ మీడియాలో వాటిని పోస్ట్‌ చేసారు. దాంతో అవి విపరీతంగా వైరల్ అయ్యాయి.


పుర్రెకో బుద్ధి..జిహ్వకో రుచి’ అన్నట్లు రెగ్యులర్‌గా చేసే వంటకాలు విసుగుపుట్టించాయోమో గత ఏడాది కొందరు వెరైటీ వంటకాలను ప్రయత్నించారు. అంతేకాదు మీరు ఈ వంటకాలను ట్రై చేయండంటూ సోషల్‌ మీడియాలో వాటిని పోస్ట్‌ చేసారు. దాంతో అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. ఐస్‌క్రీం దోశ, మ్యాగీ మిల్క్‌షేక్‌ వీడియోలకు ఊహించని స్పందన వచ్చింది. దీంతో రెగ్యులర్‌ వంటలైనా…కాస్త వెరైటీగా ట్రై చేస్తే చాలని చాలామంది డిఫరెట్‌ వంటకాలను ట్రై చేసేందుకు ఆసక్తి చూపించారు. అలా రసగుల్లా చాట్‌ వీడియో ఇంటర్నెట్‌ను షేక్‌ చేసింది.రసగుల్లా…కలకత్తా ఫేమస్‌ స్వీట్లలో ఒకటైన దీని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దీనిని చూడగానే చాలామందికి నోరూరుతుంది. ఇక చాట్‌ అంటే సాధారణంగా బంగాళాదుంపలు, పెరుగు, కారప్పూస తదితర పదార్థాలతో తయారుచేస్తారు. అయితే వీటిని వేర్వేరుగా తింటే మజా ఏముదనుకున్నాడేమో రెండింటినీ మిక్స్‌ చేశాడో వ్యక్తి. సుమారు నిమిషం పాటు నిడివి ఉన్న ఈ వీడియోలో ముందుగా చక్కెర ద్రావణంలో ముంచిన రెండు రసగుల్లాలను పిండి ఒక పాత్రలోకి తీసుకున్నాడు. వాటిని మధ్యలో కట్‌చేసి చింతపండు చట్నీ, పెరుగుతో నింపాడు. ఆ తర్వాత బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్షలతో గార్నిష్‌ చేసాడు. సర్వ్‌ చేసేముందు మళ్లీ ఒక గరిటె సహాయంతో చింతపండు చట్నీని రసగుల్లాలపై పోసాడు.ఇక మ్యాగీ ఓరియో .. చిప్స్‌ కర్రీ ..రసగుల్లా చాట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. నెటిజన్లు ఈ వెరైటీ వంటకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఇదేం వంటకంరా బాబు…రసగుల్లాలో ఛాట్‌ను, మ్యాగీలో ఓరియో బిస్కెట్లను, చిప్స్‌ కర్రీని అసలు ఊహించలేం. ఇలాంటి వెరైటీ వంటకాలతో చంపేయకండిరా బాబు’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us