అయ్యో.. పచ్చబొట్టు ఎంత పనిచేసింది!

Updated on: Nov 17, 2026 | 9:31 PM

తమిళనాడు మదురైలోని తనిష్క్ షోరూమ్‌లో జరిగిన భారీ బంగారం దోపిడీ కేసును పోలీసులు ఛేదించినట్లు కథనం పేర్కొంది. సుమారు రూ.31 కోట్ల విలువైన 15 కిలోలకు పైగా ఆభరణాలు చోరీకి గురయ్యాయి. సీసీటీవీలో కనిపించిన టాటూ ఆధారంగా యూట్యూబర్ నిషాంత్‌ను గుర్తించిన పోలీసులు, అతని ప్రియురాలు, తండ్రిని కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

ప్రేమ కోసం తాజ్‌మహల్ కట్టించిన వాళ్లని చూశాం… కానీ ఇక్కడో యూట్యూబర్, ఆర్థిక కష్టాల్లో ఉన్న తన ఇన్‌స్టా ప్రియురాలి కోసం ఏకంగా 15 కిలోల బంగారమే దోచేశాడు. సినిమా రేంజ్‌లో రెక్కీ చేసి, షోరూమ్‌లో కోట్ల విలువైన బంగారం కొట్టేశాడు కానీ… ఫ్యాషన్ కోసం వేసుకున్న టాటూ కథ మొత్తం బయటపెట్టింది. మదురైలో సంచలనం రేపిన గోల్డ్ రాబరీ కేసులో, యూట్యూబర్‌ చోరీ కంటెంట్‌ క్రియేషన్‌కు ఖాకీలు అన్‌సబ్‌స్క్రైబ్ బటన్ నొక్కి చెక్‌ పెట్టారు! ఈ లవ్ స్టోరీ వెనుక ఉన్న ఆ థ్రిల్లింగ్ క్రైమ్ ట్విస్ట్ ఏంటో మీరే చూడండి! సినిమా థ్రిల్లర్‌ను తలపించేలా తమిళనాడు మదురైలో జరిగిన తనిష్క్ బంగారం దోపిడీ మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కోట్ల విలువైన బంగారాన్ని కొల్లగొట్టి, మదకుళం చెరువు సమీపంలోని ఓ పొలంలో పాతిపెట్టిన 6 కిలోల గోల్డ్, డైమండ్స్‌ను ఖాకీలు రికవరీ చేశారు. ఈ కేసులో యూట్యూబర్ నిషాంత్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. పక్కా ఆధారాలతో రంగంలోకి దిగిన పోలీసులు, నిషాంత్‌ ప్రియురాలు, ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ మీనాక్షితోపాటు దోపిడీకి సహకరించిన నిషాంత్ తండ్రి సురేశ్‌ను అరెస్ట్ చేశారు. ప్రియురాలు మీనాక్షి కోసం నిషాంత్ వేసిన ఈ హై-వోల్టేజ్ స్కెచ్‌ను… అతని ఒంటిపై ఉన్న టాటూ నిలువునా ముంచేసింది. మదురైలో కొత్తగా తెరిచిన తనిష్క్ షోరూమ్‌లో నవంబర్ 12 ఈ భారీ దోపిడీ జరిగింది. కళ్లు చెదిరేలా సుమారు 31 కోట్ల రూపాయల విలువైన, 15 కిలోలకు పైగా ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. అయితే తాళాలు పగలగొట్టకుండా జరిగిన ఈ దోపిడీ పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. సీన్ కట్ చేస్తే… సీసీటీవీ ఫుటేజ్‌లో ఓ మిస్టరీ మ్యాన్ కనిపించాడు. దోపిడీకి ముందు నిందితుడు పక్కాగా రెక్కీ నిర్వహించాడు. కస్టమర్ వేషంలో మూడుసార్లు షోరూమ్‌కు వచ్చి… అక్కడి లూప్‌హోల్స్ అన్నీ స్టడీ చేశాడు. షోరూమ్‌కు ఇంకా పూర్తిస్థాయి లాకర్ సదుపాయం లేకపోవడం, రాత్రివేళ అలారం ఆన్ చేయకపోవడాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. భవనం వెనుక ఉన్న స్కాఫోల్డింగ్ సాయంతో టెర్రస్ ఎక్కి… అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా లోపలికి చొరబడి అందినకాడికి బంగారం దోచుకెళ్లాడు. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి నిందితుడు వేర్వేరు దుస్తులు మార్చాడు. చేతికి కట్టు కట్టుకుని, ముసుగు ధరించి జాగ్రత్త పడ్డాడు. కానీ.. మూడుసార్లు రెక్కీకి వచ్చినప్పుడు ఒకే కలర్ క్యాప్ పెట్టుకోవడం, అన్నింటికంటే ముఖ్యంగా అతని ఒంటిపై ఉన్న ఓ టాటూ సీసీటీవీలో రికార్డ్ అవ్వడం ఈ కేసులో టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఆ ఒక్క క్లూతో నిందితుడు యూట్యూబర్ నిషాంత్ అని పోలీసులు పక్కాగా ట్రేస్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తన ప్రియురాలు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మీనాక్షికి డబ్బు సర్దడం కోసమే నిషాంత్ ఈ భారీ దోపిడీకి ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. చోరీ తర్వాత కొంత బంగారాన్ని మదకుళం చెరువు సమీపంలోని ఓ పొలంలో పాతిపెట్టి, మిగతా బంగారంతో నిషాంత్ పరారయ్యాడు. దోపిడీ సమయంలో వేసుకున్న బట్టలను తగలబెట్టి సాక్ష్యాలను మాయం చేయడంలో నిషాంత్ తండ్రి సురేశ్ కూడా సహకరించినట్లు పోలీసులు తెలిపారు. ఓ పశువుల కాపరి ఇచ్చిన కీలక సమాచారం, ఆటోరిక్షా ప్రయాణం, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు వల వేశారు. మీనాక్షి, సురేశ్‌ను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా, నవంబర్ 29 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి ప్రియురాలి కష్టాలు తీర్చేందుకు యూట్యూబర్ వేసిన రాబరీ ప్లాన్‌కు… ఖాకీలు అన్‌సబ్‌స్క్రైబ్ బటన్ నొక్కేశారు. ఫ్యాషన్ కోసం వేసుకున్న టాటూతో చోరీ గుట్టు రట్టయ్యింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Upasana: నాన్న.. పిల్లల డైపర్ మారిస్తే పెద్ద గొప్పేం కాదు’ పిల్లల పెంపకంపై ఉపాసన కామెంట్స్

Rohith Naidu: హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వడంపై.. రోహిత్ నాయుడు నుంచి కీలక నోట్!

Ramayana: సీత యోధురాలే.. నా రామాయణ నిజమే! సాక్ష్యాలతో విమర్శకుల నోళ్లు మూయించిన డైరెక్టర్

సినిమా కోసం.. అమెరికాలో IT జాబ్‌కి రిజైన్‌! ఇంట్రెస్టింగ్‌గా సాత్విక స్టోరీ!

Temper Vamsi: టెంపర్ వంశీని బిగ్ బాస్‌లో ఉంచేందుకు.. పూరీ జగన్నాథ్‌ రోజూ కష్టపడుతున్నాడట!

Loading...
Unable to load recommendations.
Follow Us