Hyderabad: ఎర్రమంజిల్ జలసౌధలో నేడు KRMB త్రిసభ్య కమిటీ సమావేశం

|

Apr 12, 2024 | 1:39 PM

నేడు ఎర్రమంజిల్ జలసౌధలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం కానుంది. వేసవి కాలంలో తాగు నీటి కోసం నీటి కేటాయింపు అంశాలపై ఇరు రాష్ట్రాలు చర్చించనున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలశయాల్లో తాగునీటి అవసరాలకు గాను ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలను బోర్డు కేటాయించగా వాటి ఉపయోగంపై కీలక చర్చ జరగనుంది.

కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్ బోర్డ్‌ KRMB త్రిసభ్య కమిటీ సమావేశం హైదరాబాద్‌ ఎర్రమంజిల్ జలసౌధలో జరగనుంది. వేసవి కాలంలో తాగునీటి కోసం నీటి కేటాయింపు అంశాలపై 2 రాష్ట్రాల అధికారులు చర్చిస్తారు. ఇప్పటికే కేటాయించిన నీటితో పాటు వినియోగం, నీటి లభ్యతతో పాటు మిగులు జలాల కేటాయింపులపై ఏపీ, తెలంగాణ అధికారులతో సమావేశం జరగనుంది. KRMB బోర్డు మెంబర్ సెక్రటరీ ‘రాయిపురే’, సభ్యులు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్‌ కుమార్, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణ రెడ్డితో త్రిసభ్య కమిటీ సమావేశమౌతుంది. శ్రీశైలం, నాగార్జున్ సాగర్ జలశయాల్లో తాగునీటి అవసరాలకు గాను ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలను బోర్డు కేటాయించగా వాటి వినియోగం పై కీలక చర్చ జరగనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

 

Follow us on