Winter Health Tips: వీటిని వండుతున్నారా.. జాగ్రత్త..! అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే..(వీడియో)

|

Dec 17, 2021 | 9:22 AM

సాధారణంగా కూరగాయాలు వండుకుని తినడం మనకు అలవాటు. కానీ కొన్నిటిని వండకుండా పచ్చిగా తినడం వలన పలు అనారోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా.. శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అయితే వేటిని వండకుండా తీసుకోవాలి...

సాధారణంగా కూరగాయాలు వండుకుని తినడం మనకు అలవాటు. కానీ కొన్నిటిని వండకుండా పచ్చిగా తినడం వలన పలు అనారోగ్య సమస్యలు తగ్గడమే కాకుండా.. శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. అయితే వేటిని వండకుండా తీసుకోవాలి… ఒక వేళ వండితే ఏమవుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం…డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. డ్రైఫ్రూట్స్‌ని అలాగే తినడం లేదా.. రాత్రంతా నానబెట్టి ఉదయం తీసుకోవడం ఉత్తమం. కానీ వీటిని ఉడికించి తింటే మాత్రం చాలా ప్రమాదం. డ్రైఫ్రూట్స్‌ను ఉడకబెట్టడం వలన పోషక విలువలు తగ్గిపోవడమే కాకుండా, కేలరీలు, కొవ్వు పరిమాణం పెరుగుతుంది.

కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని పొడిగా ఉన్నప్పుడు.. లేదా పచ్చిగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు. కానీ ఉడికించి తీసుకోవడం వలన ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. ఈ కొబ్బరిని ఉడికించడం వలన అందులో ఉండే మెగ్నీషియం, సోడియం, పోటాషియం వంటి అనేక ఇతర పోషకాలు నశించిపోతాయి..ఇది ఆరోగ్యానికి మంచిదికాదు. ఇంకా.. బ్రకోలీ కూడా ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనాలు అందిస్తుంది. ఇది రోగ నిరోదక శక్తిని పెంచడమే కాకుండా.. అనేక పోషకాలను అందిస్తుంది. అయితే ఈ బ్రకోలీని ఉడికించి తీసుకోవడం వలన పోషకాలు తగ్గిపోతాయి.. అప్పుడు అది తిన్నా ఉపయోగం ఉండదు. మరో వెజిటబుల్‌ క్యాప్సికమ్. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో దిట్ట. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, చక్కెర, పీచు, ఐరన్, ప్రోటీన్, విటమిన్ సి, వంటి ఇతర అనేక పోషకాలున్నాయి. అయితే దీనిని పచ్చిగా తీసుకుంటేనే మంచిదంటున్నారు ఆహార నిపుణులు.

Follow us on