Good News for Farmers: రైతన్నలూ… మీకో గుడ్‌న్యూస్‌.. మోదీ సర్కార్‌ కీలక నిర్ణయం..!(వీడియో)

|

Dec 17, 2021 | 9:29 AM

దేశంలో ఎరువుల కొరత వేధిస్తున్న నేపథ్యంలో రైతులకు ఊరట కలిగించే వార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 16 లక్షల టన్నుల యూరియా దిగుమతికి కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎరువుల కొరతతో సతమతమవుతున్న రైతుల కష్టాలు తీరనున్నాయి.


దేశంలో ఎరువుల కొరత వేధిస్తున్న నేపథ్యంలో రైతులకు ఊరట కలిగించే వార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 16 లక్షల టన్నుల యూరియా దిగుమతికి కేంద్ర ఎరువుల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. మోడీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఎరువుల కొరతతో సతమతమవుతున్న రైతుల కష్టాలు తీరనున్నాయి.10 లక్షల టన్నుల ఎరువులు పశ్చిమ తీరంలోని ఓడరేవుకు వస్తాయని, తూర్పు తీరానికి 6 లక్షల టన్నులు వస్తాయని ఎరువుల మంత్రిత్వ శాఖ అధికారి చెప్పారు. దిగుమతి చేసుకున్న ఎరువులు దేశానికి చేరుకున్న తర్వాత, దేశీయ మార్కెట్‌లో ఇండియన్ పొటాష్ లిమిటెడ్ ఎరువులను సరఫరా చేస్తుంది.భారతదేశం ప్రతి సంవత్సరం 24 నుంచి 25 మిలియన్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తుంది. అయితే దేశంలో ఉత్పత్తిని మించి ఎరువుల డిమాండ్‌ పెరిగిపోవడంతో ప్రతి సంవత్సరం 80 నుంచి 90 లక్షల టన్నుల యూరియా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. యూరియా అవసరాలు, డిమాండ్, సరఫరా, ధరలను బేరీజు వేసుకుని ప్రభుత్వం ఎప్పటికప్పుడు యూరియా దిగుమతిని అనుమతిస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్-జూలై త్రైమాసికంలో చైనా నుంచి సుమారు పది లక్షల టన్నుల యూరియాను దిగుమతి చేసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దేశీయ అవసరాల దృష్ట్యా చైనా ఎగుమతులను నిషేధించడంతో.. భారతదేశం ఇప్పుడు రష్యా, ఈజిప్ట్ నుంచి యూరియాను దిగుమతి చేసుకుంటోంది.

Follow us on