Akashamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ అకాశంలో ఒక తార ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా ఐకాన్ స్టార్
దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా ఆకాశంలో ఒక తార త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ఆదివారం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు
దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా ఆకాశంలో ఒక తార త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ఆదివారం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. కాసేపట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరిస్తారు. ఇక ఈ చిత్రాన్ని సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మిస్తుండగా.. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా సంస్థలు సమర్పిస్తున్నాయి.
పవన్ సాధినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా, సాత్విక వీరవల్లి కథానాయికగా నటించిన ఈ సినిమా నవంబర్ 20 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమ మొత్తం 4 బాషల్లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ ఈవెంట్‌కు ప్రముఖ హీరోలు దుల్కర్ సల్మాన్‌తో పాటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తుండడంతో అభిమానులు భారీగా తరలి వచ్చారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
