AP News: ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూడగా దెబ్బకు ప్యాంట్ తడిసింది!

|

Mar 28, 2024 | 4:10 PM

కాలువలో చేపల కోసం వేసిన వలకు పెద్ద చేప చిక్కిందనుకున్నారు. ఎంత గుంజినా బయటకు రాకపోవడంతో చేపలు భారీగానే పడ్డాయి అనుకొని పొంగిపోయారు. తీరా బయటకు తీసిన తర్వాత జాలర్లు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. వలలో చిక్కింది చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా..

కాలువలో చేపల కోసం వేసిన వలకు పెద్ద చేప చిక్కిందనుకున్నారు. ఎంత గుంజినా బయటకు రాకపోవడంతో చేపలు భారీగానే పడ్డాయి అనుకొని పొంగిపోయారు. తీరా బయటకు తీసిన తర్వాత జాలర్లు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. వలలో చిక్కింది చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లకమ్మ పరిసర గ్రామాల ప్రజలు నిత్యం చేపలు వేటాడుతూ జీవనం సాగిస్తుంటారు. రోజూలాగే గురువారం కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. గుండ్లకమ్మ డ్యాంలో వల వేశారు. చేపలు పట్టుకునేందుకు వలను వేసారు. కాసేపటికి వల బరువెక్కింది. దాన్ని లాగడం ప్రారంభించారు. అయితే వల చాలా బరువుగా అనిపించింది. ఎంతలాగినా రాకపోవడంతో చేపలు దండిగా పడ్డాయనుకున్నారు. ముగ్గురు నలుగురు కలిసి వలను లాగారు. మొత్తానికి వలను ఒడ్డుకు లాగారు. వలను విప్పి చూడగానే దెబ్బకు షాకయ్యారు మత్స్యకారులు. చేపలు పడాల్సిన వలలో భారీ మొసలి పడింది. దెబ్బకు కంగారుపడ్డ మత్స్కారులు వలను అక్కడే వదిలి దూరంగా పరుగు తీశారు. అనంతరం సంబంధిత డ్యాం అధికారులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మొసలిని అక్కడినుంచి సురక్షితంగా తరలించారు. మొసలి నాగార్జునసాగర్‌ డ్యామ్‌నుంచి నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు.

Follow us on