Telangana Rains: : తెలంగాణలోని 6 జిల్లాలకు భారీ వర్ష సూచన
వాతావరణ శాఖ తెలంగాణలోని ఆరు జిల్లాలకు భారీ వర్షాలను సూచించింది. కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుండి వచ్చే తేమ గాలుల కలయిక ఈ వర్షాలకు కారణమని వివరించింది.
తెలంగాణలోని ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. నైరుతి వైపు వంపుతి రిగిన ఉపరితల ఆవర్తనం… బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుండి వచ్చే తేమ గాలులు ఈ వర్షాలకు కారణం. కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాలపై అధిక ఉపరితల ఆవర్తన ప్రభావం ఉండటంతో ఈ జిల్లాలలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మధ్య ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న అల్పపీడనం కూడా ఈ వర్షాలకు దోహదం చేస్తోంది. సముద్ర ఉపరితలంలోని 8 కి.మీ సర్కులేషన్ వల్ల బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుండి వచ్చే తేమ గాలులు తెలంగాణ మీద కలిసి భారీ వర్షపాతానికి దారితీస్తున్నాయి. గత 24-48 గంటల్లో కామారెడ్డిలో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. కామారెడ్డిలో 60 సెం.మీ., సిద్ధిపేటలో 20 సెం.మీ. కంటే ఎక్కువ, మెదక్ లో 30 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది.
Published on: Aug 29, 2025 09:09 AM
Follow Us
