Viral Video: పెళ్లి వేడుకలో వధువు డ్యాన్స్.. ఆశ్చర్యంలో వరుడు.. కామెంట్ల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు

|

Mar 28, 2022 | 7:58 AM

పెళ్లంటే (Marriage) రెండు మనసుల కలయిక. నచ్చినవారిని తమ జీవితంలోకి ఆహ్వానించే అపురూపమైన వేడుక. ఇలాంటి సంబురాలు జీవితాంతం గుర్తుండిపోయేలా కొందరు నవవధూవరులు ప్రవర్తిస్తున్నారు. స్టేజ్ పై ప్రపోజ్...

Viral Video: పెళ్లి వేడుకలో వధువు డ్యాన్స్.. ఆశ్చర్యంలో వరుడు.. కామెంట్ల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు
Bride Dance Video Viral
Follow us on

పెళ్లంటే (Marriage) రెండు మనసుల కలయిక. నచ్చినవారిని తమ జీవితంలోకి ఆహ్వానించే అపురూపమైన వేడుక. ఇలాంటి సంబురాలు జీవితాంతం గుర్తుండిపోయేలా కొందరు నవవధూవరులు ప్రవర్తిస్తున్నారు. స్టేజ్ పై ప్రపోజ్ చేయడం, కవితలు చెప్పడం, బరాత్ లో డ్యాన్స్ చేయడం వంటివెన్నో చూశాం. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో(Social Media) ఓ వీడియో వైరల్(Viral) అవుతోంది. అన్షుల్ చౌహాన్ అనే నవవధువు పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఆమె వరుడు అతీత్ కోసం వేదికపై డ్యాన్స్ చేసింది. సూర్యవంశీ చిత్రంలోని దలేర్ మెహందీ పాడిన ఐలా రే ఐల్లా పాటకు లయబద్ధంగా నృత్యం చేస్తూ ఆకట్టుకుంది. పెళ్లి డ్రెస్సులో చేసిన ఈ డ్యాన్స్ మరింత అద్భుతంగా కనిపించింది. వధువు డ్యాన్స్ చేయడం చూసి వరుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ‘విట్టీ_వెడ్డింగ్’ అనే పేజీలో పోస్ట్ అయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

Also Read

Yadadri Temple: మరికాసేపట్లో భక్తులకు యాదాద్రి నృసింహుడి నిజరూప దర్శనం.. తొలి భక్తునిగా సీఎం కేసీఆర్ ..

PVR-Inox: సినిమా తెర ప్రపంచంలో బిగ్‌ డీల్‌.. పార్టనర్లుగా మారిన పీవీఆర్‌-ఐనాక్స్‌ లీజర్‌..

Steel Road: స్టీల్ వ్యర్థాలతో రహదారి నిర్మాణం.. దేశంలోనే తొలిరి రోడ్డు.. ఇది ఎక్కడో తెలుసా..