AP Rains: బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక.. ఏపీలో ఎడతెరిపి లేని వర్షాలు

|

Jul 22, 2024 | 8:11 PM

ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల ప్రభావంతో గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం వద్ద పెరుగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాధ్ తెలిపారు. సోమవారం రాత్రి 7 గంటలకు గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని..

ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల ప్రభావంతో గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం వద్ద పెరుగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాధ్ తెలిపారు. సోమవారం రాత్రి 7 గంటలకు గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని.. నీటిమట్టం 49.4 అడుగులు, ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12.05 లక్షల క్యూసెక్కులు ఉందని.. అలాగే రాత్రికి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇప్పటికే రెండవ ప్రమాద హెచ్చరిక వలన ప్రభావితమయ్యే జిల్లాల్లోని గ్రామాల వరకు క్షేత్రస్థాయిలో ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. విపత్తుల సంస్థ ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నామన్నారు. అత్యవసర సహాయక చర్యల కోసం 4 ఎన్‌డీఆర్ఎఫ్, 6 ఎస్‌డీఆర్ఎఫ్ కలిపి మొత్తం 10 బృందాలు ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి తెలిపారు.

ప్రజల ఫోన్లకు వరద హెచ్చరిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సందేశాలు పంపుతున్నామన్నారు. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసర సహాయం, కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070,112, 1800 425 0101 సంప్రదించాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on