Watch Video: ఆ విషయంలో రైతులకు తప్పని నిరాశ.. ఆందోళనలో అన్నదాత..

|

May 27, 2024 | 1:30 PM

వానాకాలం సీజన్ ఆరంభంలోనే విత్తనాల కొరత ఏర్పడింది. విత్తనాల కోసం.. రైతులు ఆగ్రో కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. డిమాండ్‌కి తగ్గట్టు సరఫరా లేకపోవడంతో ఆందోళనకు గురైతున్నారు. ఈ ఖరీఫ్‌కు కామారెడ్డి జిల్లాలో 5లక్షల 30 వేల ఎకరాల్లో పంటలు సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు.. రైతుల కోసం 10వేల 300 మెట్రిక్ టన్నుల జిలుగు, 2వేల 366 క్వింటాళ్ల జనుము, 50 వేల 900 క్వింటాళ్ల యూరియా అవసరం అవుతుంది.

వానాకాలం సీజన్ ఆరంభంలోనే విత్తనాల కొరత ఏర్పడింది. విత్తనాల కోసం.. రైతులు ఆగ్రో కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఒకవైపు నకిలీ విత్తనాలు పెరిగిపోతుంటే.. మరోవైపు  డిమాండ్‌కి తగ్గట్టు సరఫరా లేకపోవడంతో ఆందోళనకు గురైతున్నారు. ఈ ఖరీఫ్‌కు కామారెడ్డి జిల్లాలో 5లక్షల 30 వేల ఎకరాల్లో పంటలు సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు.. రైతుల కోసం 10వేల 300 మెట్రిక్ టన్నుల జిలుగు, 2వేల 366 క్వింటాళ్ల జనుము, 50 వేల 900 క్వింటాళ్ల యూరియా అవసరం అవుతుంది. కానీ, ఇప్పటివరకు ఇందులో సగం కూడా రైతులకు అందలేదు. విత్తనాల కోసం దుకాణాల ముందు కుస్తీలు పడుతున్నారు రైతులు. నాలుగైదు గంటలు ఎదురు చూసినా..విత్తనాలు దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. రైతులు ఒక్కసారిగా విత్తనాల కోసం రావటం, షాప్‌లో స్టాక్‌ లేదనడంతో అసహనానికి గురై వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో చాలా చోట్ల పంపిణీ కూడా నిలిపివేసారు.

ఐతే జిల్లాలో విత్తనాల కొరతకు ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇబ్బందుల వల్ల లేట్‌ అవుతుందన్నారు కామారెడ్డి వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి. రైతులు ఒక్కసారిగా సొసైటీలకు వచ్చి ఇబ్బందులు పడొద్దని.. అందరికీ సరిపడినన్ని విత్తనాలు సరఫరా చేస్తామని సూచించారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి వానాలు మేనెలలోనే ప్రారంభమయ్యాయి. రైతులు ముందస్తుగా సాగుకు సన్నద్ధమవుతున్నారు. కానీ ఎరువులు, విత్తనాల పంపిణీలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. సరిపడా విత్తనాలు అందక నానా పాట్లు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్‌ దివాకర్ అందిస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on