గంటల తరబడి మొబైల్‌ చూస్తున్నారా? మీ వెన్నెముకకు ముప్పు తప్పదు!

Updated on: Aug 24, 2026 | 5:39 PM

గంటల తరబడి మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ను తల వంచి చూడటం మెడ, వెన్నెముకపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ అలవాటు ‘టెక్స్ట్ నెక్’ సమస్యకు దారితీసి మెడ, భుజాల నొప్పి, తలనొప్పి, చేతుల్లో జలదరింపు, తిమ్మిరి, బలహీనత వంటి సమస్యలకు కారణమవుతుంది. స్క్రీన్‌ను కళ్ల స్థాయిలో ఉంచడం, తరచూ విరామాలు తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా ముప్పును తగ్గించుకోవచ్చు.

చేతిలో మొబైల్ ఉందంటే చాలు.. గంటల తరబడి తల కిందికి వంచి స్క్రీన్‌ను స్క్రోల్ చేయడం నేడు చాలా మందిలో సాధారణ అలవాటుగా మారిపోయింది. ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల ముందు కూడా గంటల కొద్దీ ఒకే భంగిమలో కూర్చుంటున్నారు. అయితే ఈ జీవనశైలి కేవలం కళ్లపైనే కాకుండా, మీ మెడ , వెన్నెముకపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందంటున్నారు. సాధారణంగా మనిషి తల బరువు 10 నుంచి 12 పౌండ్లు ఉంటుంది. కానీ తలను ముందుకు వంచినప్పుడు మెడ కండరాలు, వెన్నెముకపై పడే బరువు, ఒత్తిడి గణనీయంగా పెరుగుతాయి. ఇదే భంగిమలో ఎక్కువ సమయం గడపడం వల్ల మెడ, భుజాలలో బిగుతు, తీవ్రమైన నొప్పి మొదలవుతాయి. క్రమంగా ఇది ‘టెక్స్ట్‌ నెక్‌’ అనే ఆధునిక ఆరోగ్య సమస్యకు దారితీస్తుంది. ఉద్యోగులు, విద్యార్థుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దీనివల్ల కండరాల అలసట, తరచూ తలనొప్పి, చేతులకు నొప్పి పాకడం, జలదరింపు, తిమ్మిరి, బలహీనత వంటి లక్షణాలు ఏర్పడవచ్చు. ఈ ముప్పు నుంచి తప్పించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. స్క్రీన్‌ను ఎప్పుడూ కళ్ల స్థాయికి సమానంగా ఉంచుకోవడం వల్ల మెడపై ఒత్తిడి తగ్గుతుంది. ప్రతి 20 నిమిషాలకోసారి చిన్న విరామం తీసుకుని, కళ్లకు విశ్రాంతినివ్వాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయడం ద్వారా వెన్నెముకను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారా.. ఈ 5 లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి!

Cheque Book New Rules: చెక్ బుక్‌లపై కొత్త రూల్స్.. మీ పాత చెక్ ఇక చెల్లదా?

దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..

Loading...
Unable to load recommendations.
Follow Us