ఎవరెస్టుపై మంచు తుఫాను బీభత్సం.. 1000 మంది దిగ్బంధం.. షాకింగ్ వీడియోలు వైరల్..
శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన మంచు కంటిన్యూగా కురుస్తుంది. వారాంతంలో మరింత తీవ్రమైంది. 4,900 మీటర్ల (16,000 అడుగులు) కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి రాకపోకలకు అడ్డుగా ఉన్న మంచును తొలగించడానికి వందలాది మంది స్థానిక గ్రామస్తులు, రెస్క్యూ సిబ్బందిని నియమించారు.
టిబెట్‌లోని ఎవరెస్టు పర్వతం పరిసర ప్రాంతాల్లో భారీ మంచు తుఫాను కురుస్తోంది. టిబెట్ వైపు సుమారు 16 వేల అడుగుల ఎత్తులో తుఫాను సంభవించడంతో 1000 మంది పర్వతారోహకులు, స్థానికులు చిక్కుకుపోయినట్లు సమాచారం. ఎత్తైన ప్రాంతం కావడంతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడం, గాలివానలు పెరగడం వల్ల హిమపాతం తీవ్రరూపం దాల్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన మంచు కంటిన్యూగా కురుస్తుంది. వారాంతంలో మరింత తీవ్రమైంది. 4,900 మీటర్ల (16,000 అడుగులు) కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ ప్రాంతానికి రాకపోకలకు అడ్డుగా ఉన్న మంచును తొలగించడానికి వందలాది మంది స్థానిక గ్రామస్తులు, రెస్క్యూ సిబ్బందిని నియమించారు.