ఫామ్‌లో ఉన్న బ్యూటీస్‌కి తప్పని వెయిటింగ్‌..

Updated on: Nov 13, 2026 | 11:10 AM

ఇతర భాషల్లో విజయవంతంగా దూసుకుపోతున్న భాగ్యశ్రీ బోర్సే, ప్రీతి ముఖుంధన్, మమితా బైజు లాంటి అందాల భామలకు టాలీవుడ్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు లభించడం లేదు. సాధారణంగా స్టార్ మేకర్స్ ఇలాంటి బ్యూటీలను మిస్ చేసుకోరు. కానీ ఈ నటీమణుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది.

సాధారణంగా సక్సెస్ ట్రాక్ లో ఉన్న బ్యూటీస్ ను టాలీవుడ్ మేకర్స్ అస్సలు మిస్ అవ్వరు. ఏ భాషలో స్టార్ హీరోయిన్ ఉన్నా, ఏరి కోరి తమ సినిమాలలో అవకాశం కల్పిస్తారు. కానీ కొంతమంది అందాల భామల విషయంలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. ఇతర భాషల్లో అవకాశాలు అందుకుంటూ బిజీగా ఉన్న భామలకు తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో ఛాన్సులు రావడం లేదు.సలార్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న భాగ్యశ్రీ బోర్సే, ఆ తర్వాత అదే జోరు చూపించలేకపోతున్నారు. అంత పెద్ద హిట్ తర్వాత కూడా టాలీవుడ్ స్టార్స్ ఈ బ్యూటీని కన్సిడర్ చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో ఒక్కో సినిమా చేస్తున్న భాగ్యశ్రీ తెలుగులో మాత్రం నెక్స్ట్ మూవీ సైన్ చేయలేదు.తమిళ్‌లో కొన్ని విజయవంతమైన చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రీతి ముఖుంధన్‌కు కూడా తెలుగులో ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు. ప్రస్తుతం తెలుగులో రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ఏమో ఏమో ఇది సినిమాలో మాత్రమే నటిస్తున్నారు ఈ బ్యూటీ. కన్నడలో స్టార్ లీగ్ లో ఉన్న రుక్మిణి వసంత్ కు కూడా తెలుగులో ఆఫర్స్ రావడం లేదు. ఆమె ఖాతాలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ కూడా లేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us