‘స్టార్ హీరో అనే అపోహే లేవకుండా కిందపడేసింది!

Updated on: May 28, 2026 | 12:56 PM

‘6 టీన్స్’ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో రోహిత్ స్టార్ హీరోగా ఎదగకపోవడానికి కారణాలపై దర్శకుడు జీ. నాగేశ్వర రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరైన సమయంలో వచ్చిన అవకాశాలను సరిగా వినియోగించుకోకపోవడం, సక్సెస్ తర్వాత అతిగా నమ్మకం పెరగడం వల్లే రోహిత్ కెరీర్ దెబ్బతిందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రోహిత్! ఈ పేరు వెంటే గుర్తుకు పట్టకపోవచ్చు కానీ… ‘దేవుడు వరమందిస్తే’ పాట అంటే మాత్రం.. ఇట్టే గుర్తు పట్టేస్తారు ఈ హీరోని. 2001లో వచ్చిన 6 టీన్స్ సినిమాతో… మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో.. ఆ తర్వాత యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ తన స్టార్‌ డమ్‌ ను కంటిన్యూ చేయలేకపోయాడు. సినిమాలకు దూరమయ్యాడు. రీసెంట్‌గా గుణశేఖర్ డైరెక్షన్లో యూఫోరియా సినిమాతో.. మళ్లీ సిల్వర్ స్క్రీన్‌ మీదికి ఎంట్రీ ఇచ్చి అందర్నీ సర్‌ప్రైజ్ చేశాడు. ఇక ఈ క్రమంలోనే 6 టీన్ సినిమాతో… రోహిత్‌ను హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్ జీ. నాగేశ్వర రెడ్డి…. ఈ హీరో గురించి ఓ ఇంటర్యూలో షాకింగ్ కామెంట్స్ చేశాడు. స్టార్ హీరో అవ్వాల్సిన రోహిత్ ఎందుకు ఫెయిల్ అయ్యాడనేది వివరించాడు. నాగేశ్వరరెడ్డి రోహిత్‌తో కలిసి మొత్తం నాలుగు సినిమాలు చేశాడు. అందులో రెండు హిట్లు కాగా, రెండు ఫ్లాపులు. అయితే రోహిత్ తో నాలుగు సినిమాలు పని చేసిన అనుభవం ఉన్న నాగేశ్వర రెడ్డి… ఒక స్టార్ హీరోగా రోహిత్ ఎదగకపోవడానికి గల కారణాలను తన రీసెంట్ ఇంటర్వ్యూలో వివరించాడు. ఇండస్ట్రీ ఎవరికీ అన్యాయం చేయదని, మనకు దొరికిన అదృష్టాన్ని లేదా అవకాశాన్ని సరిగ్గా వాడుకోకపోవడం వల్లే నష్టపోతామని.. రోహిత్ విషయంలో ఇదే జరిగిందని నాగేశ్వర రెడ్డి చెప్పుకొచ్చాడు. రోహిత్ అద్భుతమైన డాన్సర్ అని, మంచి హైట్,రూపం ఉన్న అందగాడని.. సరిగా తనకొచ్చిన ఛాన్స్ ను వాడుకొని ఉంటే.. ఈపాటికి అతను మంచి పొజిషన్‌లో ఉండాల్సిన హీరో అని అన్నారు నాగేశ్వర రెడ్డి. కానీ ఆ సమయంలో సరైన మెచ్యూరిటీ లేకపోవడం, వచ్చిన సక్సెస్‌ను చూసి.. ఇక తనకు తిరుగులేదు అనే అపోహలో ఉండిపోవడం, రెమ్యునరేషన్ వంటి విషయాలను సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్లే రోహిత్ స్టార్ స్టేటస్‌ను అందుకోలేకపోయాడని నాగేశ్వరరెడ్డి ఓపెన్‌గా వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నాగార్జున.. నా ముఖం మీద సిగరెట్ పొగ ఊది.. ఐలవ్యూ చెప్పాడు..

Follow Us