Vishnu Priya: అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??

Updated on: Apr 15, 2026 | 12:46 PM

యాంకర్ విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా నెలకు ₹10 లక్షల నుండి ₹11 లక్షల వరకు ఆర్జిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం ఆమె ₹390-₹399 ఛార్జ్ చేస్తుండగా, దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. యువతను పెడదోవ పట్టిస్తున్నారంటూ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆమెపై సైబర్ క్రైమ్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

లేడీ ఇన్‌ఫ్లూయనర్స్‌, ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌ ఆప్షన్‌ను.. నయా ఆదాయ మార్గంగా మార్చున్నారనే కామెంట్స్ నడుమ.. అబ్బాయిల వీక్‌నెస్‌ను ఆసరాగా తీసుకుని కొందరు సెలబ్రిటీలు గ్లామరస్ ఫోటోలను విసురుతున్నారనే విమర్శ నేపథ్యంలో.. విష్ణుప్రియపై కేసు బుక్కైంది. ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నేతలు కొంత మంది విష్ణు ప్రియ పై సూర్యారావు పేట సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాలో సబ్‌స్క్రిప్షన్‌ పేరుతో.. విష్ణు ప్రియ తన అసభ్యకర ఫోటోలు పోస్ట్‌ చేస్తూ.. యువతను పెడదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణల నడుమ.. కొన్ని వెబ్‌ సైట్స్ .. విష్ణు ప్రియ సబ్‌స్క్రిప్షన్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారనేది లెక్కేశారు. ఇప్పుడలా లెక్కేసిన ఫిగరే సోషల్ మీడియాలో అందర్నీ అవాక్కయ్యేలా చేస్తోంది. యాంకర్ విష్ణుప్రియ ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా నెలకు సుమారు ₹10 లక్షల నుండి ₹11 లక్షల వరకు సంపాదిస్తున్నట్లు రిపోర్ట్‌. విష్ణు ప్రియ తన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ చూడటానికి నెలకు ₹390 నుంచి ₹399 వరకు ఛార్జ్ చేస్తోంది. ప్రస్తుతం ఆమెకు దాదాపు 2,700 నుంచి 3,000 మందికి పైగా పెయిడ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారని తాజా నివేదికలు చెబుతున్నాయి. వీటన్నింటిని బట్టి చూస్తే విష్ణు ప్రియ నెలకు సగటున ₹10.8 లక్షల వరకు ఆదాయాన్ని అర్జిస్తోంది. ఇదే కాకుండా.. తన ఇన్‌స్టాలో బ్రాండ్ ప్రమోషన్స్‌ కూడా చేస్తూ.. అందుకు కూడా పైసలు వసూలు చేస్తోందని టాక్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Dacoit: కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!

Follow Us