స్పిరిట్ సినిమాపై అతి తెలివిగా మాట్లాడిన త్రిప్తి

Updated on: Jul 18, 2025 | 6:59 PM

తన సినిమాలతోనే కాదు.. తన మాటలతోనూ ఎప్పుడూ కాంట్రవర్సీకి కేరాఫ్‌ అయ్యే సందీప్ రెడ్డి వంగా.. ఈసారి తన నెక్ట్స్‌ సినిమా స్పిరిట్‌ ని మొదలు పెట్టటానికి ముందే సంచలనంగా మారాడు. స్టార్ హీరోయిన్ దీపికను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆమె పీఆర్ తన స్పిరిట్ సినిమా స్టోరీని లీక్ చేస్తుందంటూ ఆరోపించారు. అదే ఆరోపణ మీద తన సినిమా నుంచి దీపికాను తప్పించి, ఆమె స్థానంలో త్రిప్తి దిమ్రిని ప్రభాస్‌కు జోడీగా ఫిక్స్ చేశారు.

ఇదే విషయాన్ని అఫీషియల్‌గా కూడా అనౌన్స్ చేసి పారేశాడు.ఇక.. ఈక్రమంలోనే ప్రభాస్‌తో తన సినిమా గురించి తాజాగా నోరు విప్పింది ఈ యానిమల్ బ్యూటీ. ఎట్ ప్రజెంట్‌ ధడక్ 2 ప్రమోషన్లో బిజీగా ఉన్న త్రిప్తి.. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో తన అప్‌కమింగ్ సినిమాల గురించి చెప్పుకొచ్చింది. అందులో బాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్‌ సినిమా కోసం తాను ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టు చెప్పుకొచ్చింది. పనిలో పనిగా.. సందీప్ రెడ్డి వంగా సినిమా గురించి క్రేజీ కామెంట్స్ చేసింది. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ కోసం చాలా ఎగ్జైటెడ్‌గా ఎదురూచూస్తున్నట్టు చెప్పిన త్రిప్తి.. ‘స్పిరిట్’ ఓ బ్యూటిఫుల్ ఫిల్మ్ అంటూ కోట్ చేసింది. అయితే దీపిక గురించి మాట్లాడకుండా… కాంట్రవర్సీకి తావులేకుండా ఆచితూచి మరీ మాట్లాడింది త్రిప్తి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రిలీజ్‌కు ముందే 50 కోట్లు కొల్లగొట్టిన కింగ్‌ ??

స్పెషల్ లేడీతో మహేష్ మాస్ స్టెప్పులు.. కుర్చీని తిరగేసే ప్లాన్ చేస్తున్న జక్కన్న

‘గోదారి గట్టు’ సాంగ్‌ను మించేలా.. చిరుతో నయన్ రొమాంటిక్‌ సాంగ్

Junior: జూనియార్ రివ్యూ.. పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదే!