మాస్ మంత్రం పఠిస్తున్న క్లాస్ స్టార్స్.. రూటెందుకు మారుస్తున్నట్టు?
యంగ్ జనరేషన్ హీరోలు ప్రస్తుతం తమ రూట్‌ను మార్చుకుంటున్నారు. ఇన్నాళ్లు క్లాస్, కమర్షియల్ చిత్రాలతో అలరించిన స్టార్లు ఇప్పుడు మాస్ ఫార్ములాను అనుసరిస్తున్నారు. నాని, శర్వానంద్ వంటివారు కూడా అవుట్ అండ్ అవుట్ యాక్షన్, వయొలెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో రాబోయే సినిమాలలో క్లాస్ చిత్రాల సంఖ్య తగ్గుతోంది.
యంగ్ జనరేషన్ హీరోలు ప్రస్తుతం తమ సినీ రూట్‌ను మారుస్తున్నారు. ఇన్నాళ్లు క్లాస్, కమర్షియల్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన స్టార్లు, ఇప్పుడు మాస్ మంత్రాన్ని జపిస్తున్నారు. యువ హీరోలు సైతం ఇదే ఫార్ములాను అనుసరిస్తుండటంతో, రాబోయే చిత్రాల జాబితాలో క్లాస్ సినిమాల సంఖ్య తగ్గుతోంది. ఒకప్పుడు నాని, శర్వానంద్, నాగచైతన్య వంటి హీరోలు క్లాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో పేరు తెచ్చుకున్నారు. అప్పుడప్పుడు మాస్ చిత్రాలను ప్రయత్నించినా, వారి ప్రధాన దృష్టి కలర్‌ఫుల్ చిత్రాలపైనే ఉండేది. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. యువ హీరోలంతా మాస్ ఫార్ములాను అనుసరిస్తున్నారు. వారు ఎంచుకునే జానర్ ఏదైనా, అందులో హెవీ యాక్షన్, మాస్ ఎలివేషన్స్ ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఫ్లయిట్‌లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్
ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో
బిగ్ అలర్ట్ : కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు
Follow Us
