Top9 ET news: హమ్మయ్య.. ఇప్పటికి రూట్ క్లియర్…| రాజమౌళి నుంచి ఊహించని అప్‌డేట్
ఇరుముడి సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. రవితేజ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా హిస్టరీకెక్కింది. అంతేకాదు ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా యాక్ట్ చేసిన నక్షత్రకు తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. తన సొంత స్టేట్‌లోనూ మంచి గుర్తింపును తీసుకొచ్చింది. తాజాగా నక్షత్ర చదువుతున్న పాఠశాల యాజమాన్యం ఇరుముడి సక్సెస్‌ను గుర్తు చేస్తూ సర్‌ప్రైజ్ చేసింది. నక్షత్ర టీచర్స్ అండ్ ఫ్రెండ్స్... స్కూల్‌లో ఆమెతో కేక్ కట్ చేయించి ఇరుముడి సక్సెస్ ను సెలబ్రేట్ చేశారు. చిన్నారి నక్షత్రను అభినందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎట్టకేలకు మెగా స్టారు చిరు విశ్వంభర సినిమాకు రూట్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం విశ్వంభర ఓటీటీ బిజినెస్ క్లియర్ అవ్వడంతో రిలీజ్‌కు లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. విశ్వంభర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం సోనీ లివ్‌తో పాటు పోటీపడిన అమెజాన్ ప్రైమ్ వీడియో.. ఫైనల్‌గా భారీ ధరకు డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుందట. దీంతో థియేట్రికల్ రిలీజ్‌కు ఓటీటీ సైడ్ నుంచి ఉన్న అడ్డంకి తొలిగిపోయినట్లేనన్న టాక్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఈ మూవీ గ్రాఫిక్ రీ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందని.. ఫైనల్ కాపీ పై ఈ మూవీ టీమ్ హ్యాపీగా ఉందట. సో సంక్రాంతి కానుకగా జనవరి 13న విశ్వంభర థియేటర్లలోకి రానుందని ఫిల్మ్ నగర్ న్యూస్.
మహేష్ హీరోగా రాజమౌళి చేస్తున్న గ్లోబల్ ట్రాటర్ ఫిల్మ్ వారణాసి. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామాయణానికి సంబంధించిన 25 నిమిషాల ఎపిపోడ్ ఉందన్న న్యూస్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది.వారణాసి వీడియో గ్లింప్స్‌లో కూడా ఇందుకు సంబంధించిన సీన్లు కనిపించడం.. అవి అందర్నీ ఆకట్టుకోవడంతో.. వారణాసి సినిమాలోని రామయణ ఎపిసోడ్ పై ఎక్కువ క్యూరియాసిటీ నెలకొని ఉంది. ఈక్రమంలోనే ఈ ఎపిసోడ్ పై జక్కన్న అప్ డేట్ ఇచ్చారు. సినిమాలో సుమారు 25 నిమిషాల పాటు సాగే రామాయణ ఎపిసోడ్‌ను మొత్తం ఒక భాగంగా కాకుండా… సబ్ ఎపిసోడ్స్‌గా విభజించి కథలో భాగంగా చూపించనున్నట్లు ఎస్‌ఎస్ రాజమౌళి వెల్లడించారు. దీంతో ఈ రామాయణ ఘట్టాలను రాజమౌళి ఏ విధంగా కథలోకి తీసుకొస్తారు?, ఏ సందర్భాల్లో ఈ సబ్ ఎపిసోడ్స్ వస్తాయి? అనే ప్రశ్నలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Suriya: ఇదే సరైన టైమ్.. మొదలైన సూర్య గేమ్..!
Allu Arjun: అల్లు అర్జున్ అదిరిపోయే ప్లాన్.. ఒకేసారి రెండు సినిమాలు
షూటింగ్ అప్‌డేట్స్..ఏ హీరో షూటింగ్ ఎక్కడ జరుగుతోందో తెలుసా..?
