మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ

Updated on: Mar 03, 2026 | 11:50 AM

తెలుగు ఇండస్ట్రీలో టికెట్ రేట్ల రచ్చ మళ్ళీ మొదలు కాబోతుందా? తెలంగాణలో టికెట్ రేట్లని పెంచుకోవాలంటే కనీసం 90 రోజుల ముందు ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నది కోర్టు తీర్పు. మరి ఆంధ్రాలో పరిస్థితి ఏంటి? ఏపీలో పెంచారని తెలంగాణలో పెంచుతారా? లేకుంటే ఏపీలో మాత్రమే టికెట్ రేట్లు పెరుగుతాయా? సమ్మర్ సినిమా స్టార్టింగ్ సినారియో ఈ కాన్సెప్ట్ ని టచ్ చేయబోయే చిత్రాలు ఏంటి?

యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ వైపు ఆన్‌లైన్ ప్రమోషన్లు, మరోవైపు ఆఫ్‌లైన్ ప్రమోషన్లను కూడా చెకాచెకా ప్లాన్ చేసేస్తున్నారు మేకర్స్. అంతేనా అంటే కానే కాదు. టికెట్ రేట్ల హైక్స్ కోసం కూడా టీం గట్టిగా ప్రయత్నిస్తోందట. టాక్సిక్‌కి టికెట్ రేట్ల హైక్స్ ఇస్తే దురంధర్ సీక్వెల్‌కి కూడా ఇవ్వాల్సిందేగా అనే మాటలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ పార్ట్‌తో ఫుల్ ఖుషీగా ఉన్నారు దురంధర్ మేకర్స్. ఇప్పుడు అదే జోష్‌తో సెకండ్ పార్ట్‌ను సిద్ధం చేస్తున్నారు. సో ఈ సినిమాకు కూడా టికెట్స్ హైక్స్ కోసం ట్రై చేస్తున్నారు.

Published on: Mar 03, 2026 11:49 AM
Follow Us