Tollywood: దాసరి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ వైరల్
Thammareddy Bharadwaja

Tollywood: దాసరి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు? తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్ వైరల్

Updated on: Mar 11, 2026 | 10:13 PM

దాసరి నారాయణ రావు మరణం తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరన్న ప్రశ్నకు ప్రముఖ సీనియర్ దర్శకుడు , నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన సినిమా ప్రెస్ మీట్‌లో భాగంగా ఆయన ఈ కామెంట్స్ చేశారు.

 

 

టాలీవుడ్‌లో పెద్ద దిక్కు ఎవరనే చర్చపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వదల సినిమా ప్రెస్ మీట్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇండస్ట్రీలో పెద్ద దిక్కు అనే పదవి ఏదీ ఉండదని.. కేవలం వారు చేసే సాయం, తీసుకునే బాధ్యతలను బట్టే ఆ స్థాయి దక్కుతుందని స్పష్టం చేశారు. స్వర్గీయ దాసరి నారాయణరావును ఉద్దేశించి ఆయన పేరు ప్రస్థావించకుండా.. గతంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తన దగ్గరికి రానిచ్చేవారని.. ఆయన చేసిన పనుల వల్లే అందరికీ పెద్ద దిక్కుగా మారారని గుర్తుచేసుకున్నారు. కానీ దాసరి మరణంతో ఇప్పుడు ఆ స్థానం ఖాళీగానే ఉందన్నారు. ‘పెద్ద దిక్కు లాంటి పదాలు, పదవులు ఉండవు.. ఎవరికి వాళ్ళు చేసే పనులు బట్టి పెద్ద దిక్కు అవుతారు.. ఇదివరకు ఒకరు చేసారు.. ఆయన చేసిన పనుల వల్ల పెద్ద దిక్కు అయ్యారు.. అప్పుడు ఏం కష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్లేవాళ్లం.. ఈ రోజు ఆయన లేరు కాబట్టి పెద్ద దిక్కు లేనట్లే.. ఇకపై ఎవరూ లేరు.. ఇంకొకడు రాడు కూడా’ అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సీనియర్ దర్శక నిర్మాత కామెంట్స్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

Published on: Mar 11, 2026 10:12 PM
Follow Us