తెలుగు సినిమా షూటింగ్‌ల సందడి.. ఏ హీరో ఎక్కడున్నాడు..
తెలుగు చిత్ర పరిశ్రమలో షూటింగ్‌ల సందడి కొనసాగుతోంది. స్టార్ హీరోలంతా వివిధ లొకేషన్లలో తమ తదుపరి చిత్రాలతో బిజీగా ఉన్నారు. నాని, సమంత, శర్వానంద్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, వెంకటేష్ సహా పలువురు నటులు ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం షూటింగ్‌లతో సందడిగా ఉంది. ఒకరిద్దరు మినహా దాదాపు అందరు హీరోలు, ముఖ్యంగా స్టార్ హీరోలు, తమ సినిమా లొకేషన్లలో నిమగ్నమై ఉన్నారు. సంక్రాంతి హీరోలు సైతం తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. హలో నేటివ్ స్టూడియోలో నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ప్యారడైజ్, సమంత మా ఇంటి బంగారం, జేడీ చక్రవర్తి కొత్త సినిమా, శర్వానంద్ భోగి చిత్రాల షూటింగ్‌లు జరుగుతున్నాయి. దాసరి కళ్యాణ్ అధీర సినిమా సెట్ పనులు కూడా అక్కడే జరుగుతున్నాయి. ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ షూటింగ్ దండు మైలారంలో, మహేష్ బాబు వారణాసి షూటింగ్ గండిపేటలో నాన్ స్టాప్‌గా సాగుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సీక్వెల్స్‌కు గుడ్‌బై చెబుతున్న కెప్టెన్లు.. ఇంతకీ కారణం అదేనా
Follow Us